Newsread Image

No.1 Short News

Newsread
చంటిబిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మహా కుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కేందుకు జనం తోసుకుంటూ పరుగులు తీస్తుండగా జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో భద్రతా చర్యలను పెంచారు.ఈ సందర్భంలో,సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది,ఇందులో RPF మహిళా కానిస్టేబుల్ ఒకరు చంటిబిడ్డను ఎత్తుకొని,మరో చేత్తో లాఠీని పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.
View More
Latest News
18 Feb 2025 20:04 PM
1
7
Newsread Image

No.1 Short News

Shaida Reporter
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్ రెడ్డి
ఈరోజు తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు,దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు.
View More
Latest News
18 Feb 2025 20:04 PM
0
6
Newsread Image

No.1 Short News

Newsread
చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ
ఇమామ్ & మౌజ్జన్ల గౌరవ వేతనాలు 6నెలలకు చెల్లించాలని ఆదేశించి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, NMD ఫరూక్ కి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇమామ్ & మౌజ్జన్లకు వారి కష్టాలను గమనించి మొట్టమొదటి సారి గౌరవ వేతనం తీసుకువచ్చి ఆదుకున్న నాయకులు చరిత్ర పుటలలో చిరస్థాయిగా ఉండే పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
View More
Latest News
18 Feb 2025 19:40 PM
2
13
Newsread Image

No.1 Short News

Shaida Reporter
పెరుగుతున్న జీబీఎస్ కేసులు... కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందడం ఆందోళను పెంచుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నా... ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో జీబీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీజీఎస్ కేసులు, వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని... ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీబీఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
View More
Latest News
17 Feb 2025 19:50 PM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ ప్రభుత్వ కీలక ప్రకటనలు
మత్స్యకారులకు ఏప్రిల్ నుంచి రూ.20 వేల ఆర్థిక సాయం. మే నెలలో రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం. జూన్ లో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు తల్లికి వందనం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్
View More
Latest News
17 Feb 2025 17:30 PM
0
17
Newsread Image

No.1 Short News

Shaida Reporter
నేటి నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్
కొత్త ఫాస్టాగ్ నిబంధనల ప్రకారం.. తక్కువ బ్యాలెన్స్, పేమెంట్ ఆలస్యం లేదా ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయినా భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లోని సమస్యల కారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల లాంగ్ క్యూలను తగ్గించడమే దీనిఉద్దేశ్యం. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. వాహనం టోల్ దాటడానికి ముందు 60 నిమిషాల కన్నా ఎక్కువసేపు లేదా టోల్ దాటిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్ యాక్టివ్‌గా ఉంటే.. ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి చెల్లింపులు 176 ఎర్రర్ కోడ్‌తో రిజెక్ట్ అవుతాయని గమనించాలి.
View More
Latest News
17 Feb 2025 13:12 PM
1
15
Newsread Image

No.1 Short News

Siva Reporter
ఎర్ర ఓబునపల్లిలో చిన్నారులను ఆశీర్వదించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం పొట్లపాడు యోగయ్య స్వామి వద్ద దర్శి మండలం ఎర్రఓబనపల్లి గ్రామానికి చెందిన బాదం నాగార్జున రెడ్డి కుమార్తె కుమారుల పుటెంట్రుకల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించటం జరిగింది
View More
Latest News
17 Feb 2025 13:04 PM
1
15
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దేశం లోనే టాప్ 5 యురాలజీ సర్జన్ గా కడియాల లలిత్ సాగర్
గత రాత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా వారు విశాఖపట్నం లో నిర్వహించిన టైమ్స్ లీడర్స్ ఆఫ్ హెల్త్ కేర్ కార్యక్రమం లో వైద్య ఆరోగ్య రంగం లో గణనీయమైన కృషి చేసిన 50 మంది వైద్యులను గుర్తించి సత్కారంచడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర విమానాయ శాఖా మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ 5 న్యూరాలజిస్ట్ గా అవార్డు అందుకున్న యువనాయకులు కడియాల లలిత్ సాగర్ . లలిత్ తో పాటుగా వారి సతీమణి దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మీ మరియు కుమారులు, కడియాల అక్షయ్ నంద, కడియాల అభయ్ వర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
View More
Latest News
17 Feb 2025 12:16 PM
1
17
Newsread Image

No.1 Short News

Shaida Reporter
సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు 20 కుర్చీలు దానం చేసిన చింతా తిరుపతిరెడ్డి
దర్శి లోని గురుకుల పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన ఇచ్చిన అనంతరం దాత చింతా తిరుపతిరెడ్డి 20 కుర్చీలను విద్యాసంస్థలకు బహుకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
View More
Latest News
16 Feb 2025 17:56 PM
0
25
Newsread Image

No.1 Short News

Shaida Reporter
గురుకుల పాఠశాల లో పరీక్షలు మెలకువలు అనే అంశం పై చైతన్య సదస్సు
పరీక్షలు సమీపిస్తుండటంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు మెలకువలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవరావు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు హెచ్ఎం బసవయ్య చింత తిరుపతిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కపురం మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులందరూ మానసిక శారీరకద్రత్వాన్ని కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యవంతులుగా ఉండి ఏకాగ్రతతో కూడిన విగ్రహ శక్తి ఉంటేనే పరీక్షలలో రాణించగలరని ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
View More
Latest News
16 Feb 2025 17:48 PM
0
24
Newsread Image

No.1 Short News

Shaida Reporter
కడపలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు
శాంతి రామ్ ఐ హాస్పిటల్ కర్నూల్ వారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప లో షాహీ పేట్ గ్రీన్ ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఈరోజు ఉచిత కంటి పరీక్ష మరియు ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 వరకు ఐ క్యాంపు ఉంటుంది దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సలహాదారులు Nazar Basha Shaik Abdul కి, కార్యదర్శి Iftekhar Jamal Syed కి, మహిళా విభాగానికి MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ అభినందనలు తెలియచేశారు.
View More
Latest News
16 Feb 2025 14:36 PM
1
28
Newsread Image

No.1 Short News

Shaida Reporter
హృదయ విదారక ఘటన
ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు,అయితే తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు, అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి నిరాకరించిన సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో పడుకొని ఉన్న మహిళ.. ఏం చేయాలో తెలియని చిన్నారి అనూష తల్లిని వడిలో పడుకోపెట్టుకుని సహాయం చేసే వారికోసం ఎదురు చూస్తున్న మహిళ.
View More
Latest News
16 Feb 2025 14:32 PM
0
27
Newsread Image

No.1 Short News

Newsread
టోల్స్ వసూళ్లలో కొత్త రూల్స్ లేటైతే డబుల్ ఛార్జ్
FEB 17 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాగ్లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60నిముషాలు కంటే ఎక్కువ టైం FASTag ఇనాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 నిముషాలు తర్వాత ఇన్ఫ్ర్యాక్టివ్లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.
View More
Latest News
15 Feb 2025 21:23 PM
0
31
Newsread Image

No.1 Short News

Newsread
యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది దుర్మ‌ర‌ణం!
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భ‌క్తుల‌తో వెళుతున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది భ‌క్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మ‌రో 19 మంది గాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మేజా స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.
View More
Latest News
15 Feb 2025 12:17 PM
0
27
Newsread Image

No.1 Short News

Newsread
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికాలో స్త్రీ, పురుషులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్ ను గుర్తించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీలోకి ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేయబోమని స్పష్టం చేశారు. ఈమేరకు సైన్యంలో ట్రాన్స్ జెండర్ల ఎంట్రీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా యూఎస్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లింగ మార్పిడికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
View More
Latest News
15 Feb 2025 12:14 PM
0
27
Newsread Image

No.1 Short News

Newsread
జగన్ ట్వీట్ ఆయన నేర స్వభావాన్ని చాటుతోంది: నిమ్మల రామానాయుడు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అలాంటి నేరస్తుడిని సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని విమర్శించారు. మహిళలు, దళితులు అంటే జగన్ కు చిన్నచూపు ఉందని... వారికంటే వంశీలాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా? అని ప్రశ్నించారు.
View More
Latest News
15 Feb 2025 12:03 PM
0
25
Newsread Image

No.1 Short News

Newsread
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఇంటర్ మార్క్స్ మెమోలలో ఫొటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధిత విద్యార్థులంతా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీ, కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీకి చెందినవారు. వీరు 2024లో ఇంటర్ పాస్ అయ్యారు.
View More
Latest News
15 Feb 2025 12:01 PM
0
26
Newsread Image

No.1 Short News

Newsread
తదుపరి సీఈసీ ఎంపికకు పీఎం మోదీ నేతృత్వంలో 17న ఉన్నత స్థాయి కమిటీ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఈసీ ఎంపికకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు.
View More
Latest News
15 Feb 2025 11:59 AM
0
24
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దర్శి లో దామోదర సంజీవయ్య జయంతి ఘనంగా నిర్వహణ
ఈరోజు దామోదర సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా స్థానిక తహశీల్దారు కార్యాలయంలో DT V వెంకటేశ్వర్లు,కపురం శ్రీనివాసరెడ్డి ఇరువురు కలసి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా,రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా 2సార్లు AICC అధ్యక్షునిగా,సంయుక్త మద్రాసు,ఆంధ్ర రాష్ట్రాల లో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,కేంద్రంలొ అనేక సార్లు మంత్రిగాజేశారు.AICC తొలి దళిత అధ్యక్షుడిగా చేశారు.38 సంవత్సరాల చిన్నవయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కుతుందని IRCS ఎగ్జకూటివ్ మెంబరు,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు.సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
14 Feb 2025 15:37 PM
1
42
Newsread Image

No.1 Short News

Shaida Reporter
డిగ్రీ ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రతిభ
నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల, దొనకొండ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. బీకాం కంప్యూటర్ విభాగంలో 700 మార్కులకు కళాశాల ప్రథమ స్థానంలో P. సుబ్బయ్య 567, రెండో స్థానంలో CH. సీమోను 546, మూడో స్థానంలో S. కాంతకుమారి 543 మార్కులు సాధించారు. బిఎ విభాగంలో 600 మార్కులకు Sk. నాజ్ 509, M. సానియా మీర్జా 464, N. సువర్ణ 432 మార్కులు సాధించారు. వీరిని గౌతమీ విద్యాసంస్థల చైర్మన్ కే.గుండారెడ్డి, సీఈవో నాగేంద్రబాబు,ప్రిన్సిపాల్ రామయోగి, అధ్యాపకులు అభినందించారు.
View More
Latest News
14 Feb 2025 14:44 PM
0
34
Newsread Image

No.1 Short News

Shaida Reporter
ఏపీలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
ఏపీ రాష్ట్రంలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. ఉ.10 నుంచి 12:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మ.3 నుంచి సా.5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
View More
Latest News
14 Feb 2025 12:40 PM
0
30
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుకు భారీ ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మైక్ తో మోహన్ బాబు దాడి చేయడం వలన, బాధిత జర్నలిస్టు పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ, మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
View More
Latest News
13 Feb 2025 17:51 PM
2
37
Newsread Image

No.1 Short News

Umar Fharooq
గిద్దలూరు లో టిడిపి నాయకుడు కిషోర్ మృతి
అనారోగ్యంతో గిద్దలూరు టిడిపి నాయకుడు మేకల కిషోర్ మృతి చెందాడు. గిద్దలూరు ఎమ్మెల్యే సోదరులు ముత్తుమూలకృష్ణ.కిషోర్ రెడ్డి.త దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
View More
Latest News
13 Feb 2025 17:51 PM
0
29
Newsread Image

No.1 Short News

Umar Fharooq
టీడీపీ ఎమ్మెల్యే పై హత్యాయత్నం
టీడీపీ చింతమనేని ప్రభాకర్ పై హత్యయత్నం జరిగింది. నిన్న రాత్రి వట్లూరులోని ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో, పక్కా పథకం ప్రకారమే అల్లరిమూకలు ఐరన్ రాడ్ తో దాడికి యత్నించారని ,గన్ మెన్ నుంచి గన్ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారని, చింతమనేని వ్యక్తిగత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కోవడంతో దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు.
View More
Latest News
13 Feb 2025 17:50 PM
0
31
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్ చేయాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ, వల్లభనేని వంశీ మనిషి కాదని, ఆయన ఒక మృగమని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని, కార్లు తగులబెట్టారని, మనుషులను చంపేందుకు కూడా యత్నించారని అన్నారు. కేసు పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్ ని భయపెట్టాడని చెప్పారు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని అన్నారు. వంశీతో పాటు మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పారు.
View More
Latest News
13 Feb 2025 14:35 PM
0
30
Newsread Image

No.1 Short News

Shaida Reporter
మానవతా సంస్థ ఆద్వర్యం లో కుష్టు వ్యాధిపట్ల అవగాహన సదస్సు
దర్శి లోని వివేకానంద స్కూల్ లో మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని స్పర్శ అనే కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యం లో అవగాహన కల్పించి 20 మందికి 1100 విలువ గల కిట్లు, పౌష్టికాహారం, దుప్పట్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా తహశీల్దార్ శ్రావణ్ కుమార్, నగర కమీషనర్ మహేష్ , ప్రముఖ వైద్యులు డా|| మల్లారెడ్డి మానవతా సంస్థ ప్రతినిధులు దేవతి ప్రసాద్, కపురం శ్రీనివాసరెడ్డి, రామాంజినేయులు, వెంకటరెడ్డి, గణేష్, లెప్రసి డాక్టర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
View More
Latest News
13 Feb 2025 13:13 PM
0
31
Newsread Image

No.1 Short News

Shaida Reporter
ఏపీలోని ఏలూరులో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ
ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని ఉంగుటూరు మండల పరిధిలో కోళ్ల ఫారం సమీపంలో ఉంటున్న వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఏపీలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కు సంబంధించి తొలి కేసు నమోదైందని అధికారులు చెప్పారు.
View More
Latest News
13 Feb 2025 12:14 PM
1
32
Newsread Image

No.1 Short News

Shaida Reporter
భారత నౌకాదళంలో 270 పోస్టులు.. ఎస్ఎస్ సీ నోటిఫికేషన్
భారత నౌకాదళంలో వివిధ పోస్టుల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్ సీ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాలలో మొత్తం 270 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా పోస్టులను బట్టి పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదని, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్యూకు పిలవనున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటామని, వీరికి మొదటి నెల నుంచే రూ.లక్ష వేతనంగా చెల్లించనున్నట్లు తెలిపింది.
View More
Latest News
13 Feb 2025 11:55 AM
0
30
Newsread Image

No.1 Short News

Shaida Reporter
కేరళలో ర్యాగింగ్ పేరుతో దారుణం.. జూనియర్లకు నరకం చూపించిన సీనియర్లు
ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై సీనియర్ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. ఏకంగా మూడు నెలలపాటు కొనసాగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది. కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. వారిని నగ్నంగా నిలబెట్టి, వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. అక్కడితో ఆగకుండా కంపాస్‌లోని పదునైన పరికరాలను గుచ్చి గాయపర్చారు. ఇలా మూడు నెలలపాటు సాగిందీ దమనకాండ. గాయాలైన మర్మాంగాలకు బాధితులు లోషన్ పూసుకుంటే, విషయం తెలిసిన సీనియర్లు మరింతగా చెలరేగిపోయారు. ఆ లోషన్‌ను వారి నుంచి బలవంతంగా లాక్కుని దానిని వారి నోట్లో పిండారు. అంతేకాదు, ప్రతిదానిని వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటపెడితే అకడమిక్ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
View More
Latest News
13 Feb 2025 10:23 AM
0
26
Newsread Image

No.1 Short News

Shaida Reporter
చినరీకట్ల లో మల్టీ పర్పస్ రోబో ను తయారు చేసిన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్
కొనకనమిట్ల మండలం చిన్నారి కట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ కోటేశ్వరరావు మల్టీపర్పస్ రోబోను తయారుచేసి దున్నటము, విత్తనాలు చల్లటం, కలుపు తీయడం, కోత పనులు, పురుగు మందులు పిచికారి చేయటం, ఇవన్నీ రిమోట్ సాయంతో చేసేలాగా తయారు చేశారు. ఈ రోబో సౌరశక్తి, ఇంధనంతో పనిచేస్తుంది. AI టెక్నాలజీ ద్వారా రిమోట్ లేకుండా స్వయంగా పనిచేసేలా త్వరలో తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు.
View More
Latest News
13 Feb 2025 09:47 AM
1
29
Newsread Image

No.1 Short News

Shaida Reporter
గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు హాల్‌టికెట్‌లు గురువారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ. నరసింహమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు గురువారం నుండి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.
View More
Latest News
13 Feb 2025 09:35 AM
0
25
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మార్కెట్లోకి త్వరలో కొత్త రూ.50 నోట్లు
భారత్ లో సరికొత్త 50 రూపాయల నోట్లు చలామణీలోకి రానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సన్నాహాలు చేస్తోంది. ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన ఈ కొత్త రూ.50 నోట్లను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. కొత్త నోట్లు వచ్చినా, ఇప్పటికే అమల్లో ఉన్న పాత రూ.50 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
View More
Latest News
13 Feb 2025 08:15 AM
0
26
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తెలంగాణ సచివాలయంలో ఆరో అంతస్తు నుండి ఊడిపడిన పెచ్చులు
తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంలోని ఆరో అంతస్తు నుండి పెచ్చులు ఊడి, పార్కింగ్‌లో ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడ్డాయి. ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. పెచ్చులు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సచివాలయంలోని ఆరో అంతస్తులోనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉన్నాయి.
View More
Latest News
13 Feb 2025 08:15 AM
0
25
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే
వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. జగన్ 2.0లో ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా అండగా ఉంటానని చెప్పారు. లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వేశామని తెలిపారు. ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
View More
Latest News
13 Feb 2025 08:15 AM
0
21
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఫ్రాన్స్ లో భారత అమరవీరులకు నివాళి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో మెజార్గ్విస్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు మోదీ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ తన పర్యటనలో భాగంగా మాసేలో భారత నూతన కాన్సులేట్ ను కూడా ప్రారంభించారు. ఈ కాన్సులేట్ భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, పరస్పర ప్రజా సంబంధాల పటిష్టతకు వారధిలా నిలుస్తుందని అభివర్ణించారు.
View More
Latest News
13 Feb 2025 08:14 AM
0
20
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వాలంటైన్స్ డే ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన ఇండిగో
ప్ర‌ముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో వాలంటైన్స్ డే ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. అయితే, ఇద్ద‌రు ప్ర‌యాణికుల‌కు క‌లిపి టికెట్ బుక్ చేస్తేనే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఇండిగో తెలిపింది. ఫిబ్ర‌వ‌రి 14న‌ సంస్థ‌ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్ యాప్ ద్వారా చేసే తొలి 500 బుకింగ్స్ పై అద‌నంగా 10 శాతం త‌గ్గింపును ఇవ్వ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. దీన్ని 14వ తేదీ రాత్రి 8 గంట‌ల నుంచి 11.59 గంటల మ‌ధ్య నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.
View More
Latest News
13 Feb 2025 08:14 AM
0
15
Newsread Image

No.1 Short News

Umar Fharooq
రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ముస్లింలకు రంజాన్ మాసం పరమ పవిత్రమైనది. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటూ దీక్ష ఆచరిస్తారు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. త్వరలోనే రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, అన్ని రకాల ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు మార్చి 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేస్తూ,ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
View More
Latest News
13 Feb 2025 08:14 AM
2
22
Newsread Image

No.1 Short News

Newsread
ఫిబ్రవరి 13 న కుష్టు రోగులకు అండగా దర్శి లో పౌష్టికాహారం మెడికల్ కిట్ల పంపిణీ.
మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు దరిశి ఏరియాలోని కుష్ఠురోగులకు అవగాహన సదస్సు వివేకానంద హైస్కూల్ నందు పౌష్టికాహార సరుకులు,సబ్బులు,దుప్పట్లు,మెడికల్ కిట్టు పంపిణీ జరుగుతుని ఆ సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
View More
Latest News
12 Feb 2025 23:26 PM
0
15
Newsread Image

No.1 Short News

Shaida Reporter
బూచేపల్లి వెంకాయమ్మ ను మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్సార్ పార్టీ స్పోక్స్ పర్సన్ శ్యామల
ఈరోజు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బూచేపల్లి స్వగృహం నందు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ శ్యామల మర్యాదపూర్వకంగా కలిశారు.
View More
Latest News
12 Feb 2025 22:47 PM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
వివాహ శుభకార్యక్రమానికి హాజరైన టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్
12-02-2025 ఈరోజు సాయంత్రం దర్శి మండలం, తూర్పు వీరయపాలెం లో మధుమంచి వారి వివాహానికి హాజరై నూతన వధూవరులు చి|| చంద్ర శేఖర్ - చి|| ల|| సౌ|| అక్షయ లను ఆశీర్వాదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ . వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
12 Feb 2025 22:16 PM
1
18
Newsread Image

No.1 Short News

Newsread
డాక్టర్ విక్రమ్ ఆర్థోకేర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్
శ్రీ కొండ గురునాధ స్వామి తిరునాళ్ల సందర్భంగా డాక్టర్ విక్రమ్ ఆర్థోకేర్ శ్రీ రాజారాజేశ్వరి హాస్పిటల్ బృందం కలిసి పెద్ద ఉల్లగళ్లు లో ఉచిత మెడికల్ క్యాంపు నిరహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో సుమారు 150 మంది వరకు ఉచితంగా హెల్త్ చెకప్ లు నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ విక్రమ్ ఆర్థోకేర్ బృందానికి కొండ గురునాథస్వామి తిరునాళకు వెళ్ళే భక్తులు, ఉల్లగల్లు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
View More
Latest News
12 Feb 2025 21:53 PM
1
17
Newsread Image

No.1 Short News

మహతి న్యూస్
దేవలూటి శంకర్ ని కలిసిన లెక్చరర్ నారాయణ
మార్కాపురంలో రజక విద్యా సేవా సంక్షేమ సంఘం AP & TG రాష్టాల అధ్యక్షులు శంకర్ ని లెక్చరర్ నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. తాను చేస్తున్న విద్యాపరమైన కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, లెక్చరర్ నారాయణ తన మిత్రులు శంకర్ ను అభినందించారు.భవిష్యత్తులను పేద విద్యార్థుల కోసం మంచి మంచి విద్యాపరమైన కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.శంకర్ తో పాటు శ్రీ లక్ష్మి, వెంకటేశ్వరరెడ్డి, గురుబాబు, కాశిరావు, కృష్ణమూర్తి, కౌలూరి శ్రీనివాసులు, ముత్తుకూరి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
12 Feb 2025 21:39 PM
0
16
Newsread Image

No.1 Short News

Shaida Reporter
తిరునాళ్ళ సందర్భంగా ఉల్లగల్లులో రాజరాజేశ్వరి హాస్పిటల్ వారి మెడికల్ క్యాంపు
శ్రీ కొండ గురునాధ స్వామి తిరునాళ్ల సందర్భంగా Dr విక్రమ్ ఆర్థోకేర్ రాజ రాజేశ్వరి హాస్పిటల్ బృందం కలిసి పెద్ద ఉల్లగల్లు లో ఉచిత మెడికల్ క్యాంపు నిరహించి 150 మందికి op చూడబడినది వారికీ మందులు కూడా ఉచితం గా ఇవ్వబడినది.
View More
Latest News
12 Feb 2025 20:45 PM
1
18
Newsread Image

No.1 Short News

Shaida Reporter
తాళ్లూరులో వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన దినోత్సవ కార్యక్రమం
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం ఆన్సారియా ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో వెట్టిచాకిరీ నివారణ వారోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెట్టిచాకిరిని నిషేధించాలని దానికి సంబంధించి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా హక్కుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు ఎంపీడీవో హనుమంతరావు, ఎమ్మార్వో జై ఇమ్మానియేల్ రాజు, మండల విద్యాధికారి సుబ్బయ్య, తాళ్లూరు A SI మోహన్ రావు, తాళ్లూరు పంచాయతీ సెక్రటరీ iv రమణారెడ్డి,DBRC ఏరియా కో ఆర్డినేటర్ తప్పేట డేవిడ్, సుధాకర్,అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
12 Feb 2025 12:26 PM
2
38
Newsread Image

No.1 Short News

Umar Fharooq
నీలకంఠాపురం రఘువీరా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు,మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (cwc) సభ్యులు నీలకంఠాపురం రఘువీరారెడ్డిని కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి, దర్శి నియోజకవర్గం కోఆర్డినేటర్.
View More
Latest News
12 Feb 2025 11:09 AM
0
26
Newsread Image

No.1 Short News

Umar Fharooq
రంగరాజన్ పై దాడిని ఖండిస్తున్న చంద్రబాబు
హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై రామరాజ్యం సంస్థ సభ్యులు దాడి చేయడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులను తమ సంస్థలో చేర్చాలని రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కోరగా, రంగరాజన్ అందుకు నిరాకరించారు. దాంతో రామరాజ్యం సభ్యులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి హేయమని, దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు.
View More
Latest News
11 Feb 2025 22:38 PM
0
23
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మాపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే మేం వ్యతిరేకం.
విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా ఘాటుగా స్పందించారు. మాపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే మేం వ్యతిరేకం. ఇప్పటి నుంచి అలాంటి ఆర్టిస్టు ఉన్న ప్రతి సినిమాని వ్యతిరేకించండి .మన మీద జోకులు వేసే ఆర్టిస్ట్ ఉండే ప్రతి సినిమాను బాయ్ కాట్ చేయండి.సినిమా ఇండస్ట్రీని మాత్రం కాదు అని శ్రేణులకు పిలుపునిచ్చారు.
View More
Latest News
11 Feb 2025 22:38 PM
0
24
Newsread Image

No.1 Short News

Umar Fharooq
లిక్కర్ స్కాంపై త్వరలోనే చర్యలు
జగన్ నాసిరకం మద్యం ఇస్తే, తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం ఇస్తున్నామని, మంచి బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని, గత ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని, తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని, ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
View More
Latest News
11 Feb 2025 22:35 PM
0
22
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ
వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఒంగోలుమాడరన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకట రమణా రెడ్డి, డాక్టర్ డి అర్పణ షాషర్ ఆధ్వర్యంలో నిపుణులు వైద్య పరీక్షలు 350 విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో కంటి సమస్యలు ఉన్న 60 మంది విద్యార్థులను గుర్తించారు. ఉపాధ్యాయులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. హెచ్ ఎం శేష గిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ..... వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఒంగోలుమాడరన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకట రమణా రెడ్డి, డాక్టర్ డి అర్పణ షాషర్ ఆధ్వర్యంలో నిపుణులు వైద్య పరీక్షలు 350 విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో కంటి సమస్యలు ఉన్న 60 మంది విద్యార్థులను గుర్తించారు. ఉపాధ్యాయులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. హెచ్ ఎం శేష గిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
11 Feb 2025 21:08 PM
0
25
Newsread Image

No.1 Short News

Umar Fharooq
విజయవాడ మెట్రో కు తొలి అడుగు
విజయవాడ నగరం వాసుల మెట్రో కలలు నిజం కానున్నాయి. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశను కలిసి ప్రతిపాదనలు అందజేసింది. ముందుగా నాలుగు కారిడార్లుగా విజయవాడ మెట్రో నిర్మాణం చేపట్టాలని భావించారు. ముందుగా గన్నవరం, పెనమలూరు నుంచి రెండు కారిడార్లు నిర్మించడంపైనే దృష్టి తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు. ఇది పీఎన్‌బీఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్‌ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చి, అక్కడి నుంచి గన్నవరం వెళ్తుంది. ఈ క్రమంలో యోగాశ్రమం, విమానాశ్రయం, గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమానూరు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తాల మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఏలూరు రోడ్డులోకి వంపు తిరిగి గుణదల, పడవల రేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్‌రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీన్‌బీఎస్‌కు రైలు చేరుకుంటుంది. 12.5 కిలోమీటర్లు మేర ఉండే రెండో కారిడార్‌ పీఎన్‌బీఎస్ నుంచి ప్రారంభమై బందరు రోడ్డు మీదుగా బెంజిసర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకు వెళ్తుంది. ఈ క్రమంలో పీఎన్‌బీఎస్, బందరు రోడ్డులో విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజి సర్కిల్, ఆటోనగర్, అశోకనగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్ తాడిగడప, పోరంకి మీదుగా పెనమలూరుకు చేరుకుంటుంది.
View More
Latest News
11 Feb 2025 18:00 PM
0
28
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    | newsread.in

    Install App

    Install App
    Cancel