No.1 Short News

BSR NEWS
Saif Ali Khan: ఆసుప‌త్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్‌
క‌త్తిపోట్ల‌కు గురైన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ముంబ‌యి లీలావ‌తి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కాసేప‌టి క్రితం ఆయ‌న ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండ‌గుడు క‌త్తితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ఆగంతుకుడు ఆయ‌న‌పై దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. దీంతో ఐదు రోజుల పాటు లీలావ‌తి ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందారు. సైఫ్ కోలుకోవ‌డంతో ఈరోజు ఆయ‌న‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
Breaking News
21 Jan 2025 15:44 PM
3
25