No.1 Short News

Newsread
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు: జనసేన కేంద్ర కార్యాలయం
డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో... నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. దీనిపై మాట్లాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. మరోవైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పడుతుందేమో వేచి చూడాలి.
Breaking News
21 Jan 2025 16:17 PM
3
31