No.1 Short News

Newsread
Janasena: జనసేనకు గుడ్ న్యూస్... గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ లేఖ పంపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన పార్టీ రికార్డు సృష్టించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో, ఈసీ రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచిన జనసేన పార్టీ... గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా సొంతం చేసుకుంది.తాజా ప్రకటనతో, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన అవతరించింది. ఇకపై గాజు గ్లాసు గార్తు జనసేనకు శాశ్వతంగా సొంతమైంది.
Breaking News
21 Jan 2025 22:43 PM
6
34