No.1 Short News

Newsread
ఏడాది పాలనలో రెగ్యులర్గా పింఛన్లు పంపిణీ చేసిన ఘనత కూటమిదే - గొట్టిపాటి లక్ష్మి
తాళ్లూరు మండలం, శివరామపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... ప్రతి అవ్వ, ప్రతి తాత మోములో చిరునవ్వు మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ బాబు గారు చూడాలన్నదే సంకల్పంతో క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. గత ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టివేశారు, సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే పాలనను గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం, భరోసా పెన్షన్ మొత్తాన్ని క్రమం తప్పకుండా అందజేస్తూ, అభివృద్ధి - సంక్షేమ పాలనను ముందుకు తీసుకు వెళుతున్నాం. 2047 మిషనరీ మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా పాలన సాగుతుంది. నిన్న కడపలో జరిగిన మహానాడులో అందుకు సంబంధించిన దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది జూన్ నుండి తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. కుటుంబంలోని ప్రతి చదువుకునే బిడ్డకు తల్లికి వందనం ద్వారా 15000 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇక ఆగస్టు నుండి ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేపట్టడం జరుగుతుందని డాక్టర్ లక్ష్మి వివరించారు. ఇలా అభివృద్ధి సంక్షేమంతో మన కూటమి పాలన ఏడాదిలో ప్రజా మన్ననలు పొందిందని తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వైపు పరుగులు తీద్దామని ఆమె తెలిపారు. మన కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి సహకరించాలని దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందామని డాక్టర్ లక్ష్మీ వివరించారు.
Latest News
31 May 2025 13:03 PM
0
44

Newsread
For better experience and daily news update.
Download our app from play store.