No.1 Short News

Sk.Asma Reporter 9948680044
జిల్లాలోని ముస్లిం సోదర సోదరీ మణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి సన్మార్గంలో జీవనం సాగించాలనే గొప్ప సందేశాన్ని మానవాళికి చూపుతూ, తమకు కలిగిన దాంట్లో నుండి ఇతరులకు పంచిపెట్టే దాతృత స్ఫూర్తిని కలిగిస్తూ త్యాగానికి, సత్యానికి ప్రతీకగా నిల్చే బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. బక్రీద్‌ పండుగ వేడుకలు, కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమైనదని, ముందస్తు భద్రత చర్యల్లో అన్ని మత పెద్దలతో, శాంతి కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించి ప్రార్ధనలు మరియు ఇతర కార్యక్రమాలు సమయములలో ఎలాంటి సంఘటనలు, సమస్యలు లేకుండా సుఖ శాంతులతో జరుపుకోవాలని సూచిస్తూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్స్, సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోని మసీదులను కవర్ చేస్తూ పెట్రోలింగు నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగు చేసుకోవాలన్నారు. మతసామరస్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు, గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా గోవులను తరలించినా, గోవధకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. జంతువుల అక్రమ రవాణా, గోవధ నిరోధించడానికి ప్రకాశం జిల్లా నోడల్ అధికారిగా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. ప్రభుత్వం గోవధను నిషేధించిందని, గో సంరక్షణ చట్టం ప్రకారము గోవులను వధించడం చట్టరీత్య నేరం. శాంతి భద్రతల సమస్యలు, మత సంఘర్షణలు తలెత్తేలా ఎవ్వరు ప్రవర్తించకూడదు, ప్రేరేపించరాదు. మత ఘర్షణలను ప్రేరేపించే పుకార్లను నమ్మవద్దు, అపోహలు, వదంతులను నమ్మి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయరాదు.అందరు మతసామరస్య భావనతో శాంతియుతంగా మెలగాలి. గోవధ, పశువుల అక్రమ రవాణా పై ఏదైనా సమాచారమును పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ :9121102266, డయల్ :112/100 స్ధానిక పోలీసులకు తెలియచేయాలి. వ్యక్తిగతంగా వాహనాలను ఆపి గొడవలకు దిగరాదని,ఆ సమాచారం పోలీస్ లకు తెలియచేయాలని, కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు ఎస్పీ గారు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News
07 Jun 2025 07:43 AM
2
45

Newsread
For better experience and daily news update.
Download our app from play store.