No.1 Short News

Newsread
ఉల్లగల్లో మహిళా శక్తికి కొత్త అధ్యాయం – జన్ శిక్షణ సేవా సంస్థాన్ టైలరింగ్ కోర్స్ ముగింపు
ఉల్లగల్లు, ప్రకాశం జిల్లా: జన్ శిక్షణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా నిర్వహించిన టైలరింగ్ కోర్సు ఈరోజుతో విజయవంతంగా పూర్తైంది. ఈ కోర్సులో పాల్గొన్న 20 మంది మహిళలు టైలరింగ్ నైపుణ్యాలను అభ్యసించి, స్వయం ఉపాధికి దారి తెరిచారు. ట్రైనర్ ప్రసన్న మాట్లాడుతూ, “ఈ కోర్సు ద్వారా మహిళలు స్వంతంగా ఉపాధి పొందే సామర్థ్యం పెరిగింది. ఇంటి వద్దే టైలరింగ్ ప్రారంభించవచ్చు, చిన్న స్థాయిలో బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టొచ్చు” అని తెలిపారు. కార్యక్రమ ముగింపు సందర్భంగా ట్రైనర్ ప్రసన్నకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక మహిళలు, సంస్థ ప్రతినిధులు సునీల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉల్లగల్లు కు తీసుకువచ్చేందుకు కృషి చేసిన భూలక్ష్మిని కూడా మహిళలు ప్రశంసిస్తూ సన్మానించారు.
Latest News
09 Jan 2026 14:12 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.