Revanth Reddy: అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది?: రేవంత్ రెడ్డి

newsread.in

Revanth Reddy: అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది?: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రస్తావన రావడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ పై తనకు కోపం ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ... అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Fresh News
26 Dec 2024 19:49 PM
2