No.1 Short News

Newsread
‘కేజ్రీవాల్ జీ, యమునా నది నీళ్లు తాగి చూడండి.. ఆసుపత్రికి వచ్చి పరామర్శిస్తా.. రాహుల్ గాంధీ
అవినీతిని అంతం చేస్తానని, కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ చివరకు నరేంద్ర మోదీకి డూప్ లాగా మారిపోయాడని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ నేతపై మండిపడ్డారు. ఐదేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చి పదేళ్లు గడిచాయని చెప్పారు. యమునా నది శుద్ధి అయినట్లేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే యమునా నది నీటిని తాగాలని కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. ఆయన నిజంగానే తాగితే తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తానని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆ నీరు తాగితే ఆసుపత్రిలో చేరాల్సిందేననే చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Latest News
03 Feb 2025 13:56 PM
1
16