No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
వ‌ర‌ల్డ్ రికార్డు ముంగిట మహమ్మద్ షమీ.. మ‌రో 5 వికెట్లు తీస్తే చాలు..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకున్న ఆతిథ్య భార‌త్ ఇప్పుడు వ‌న్డే సిరీస్‌పై క‌న్నేసింది. రేప‌టి నుంచి మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) స్టేడియంలో తొలి వ‌న్డే జరగనుంది. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా స్పీడ్‌స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా లేక‌పోవ‌డంతో సీనియ‌ర్ పేస‌ర్ మహమ్మద్ షమీ బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపించ‌నున్నాడు. అయితే, ఈ మ్యాచ్ కు ముందు షమీని ఓ వ‌ర‌ల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు తాను ఆడిన 101 వన్డేల్లో 195 వికెట్లు సాధించిన షమీ... నాగ్‌పూర్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టగలిగితే, అతను ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డును స‌మం చేస్తాడు.
Sports News
05 Feb 2025 12:24 PM
0
36