No.1 Short News

Umar Fharooq
ఫ్రాన్స్ లో భారత అమరవీరులకు నివాళి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో మెజార్గ్విస్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు మోదీ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ తన పర్యటనలో భాగంగా మాసేలో భారత నూతన కాన్సులేట్ ను కూడా ప్రారంభించారు. ఈ కాన్సులేట్ భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, పరస్పర ప్రజా సంబంధాల పటిష్టతకు వారధిలా నిలుస్తుందని అభివర్ణించారు.
Latest News
13 Feb 2025 08:14 AM
0
21