

No.1 Short News
Umar Fharooqమరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్ చేయాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ, వల్లభనేని వంశీ మనిషి కాదని, ఆయన ఒక మృగమని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని, కార్లు తగులబెట్టారని, మనుషులను చంపేందుకు కూడా యత్నించారని అన్నారు. కేసు పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్ ని భయపెట్టాడని చెప్పారు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని అన్నారు. వంశీతో పాటు మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పారు.
Latest News
13 Feb 2025 14:35 PM