

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరండిగ్రీ ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రతిభ
నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల, దొనకొండ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. బీకాం కంప్యూటర్ విభాగంలో 700 మార్కులకు కళాశాల ప్రథమ స్థానంలో P. సుబ్బయ్య 567, రెండో స్థానంలో CH. సీమోను 546, మూడో స్థానంలో S. కాంతకుమారి 543 మార్కులు సాధించారు. బిఎ విభాగంలో 600 మార్కులకు Sk. నాజ్ 509, M. సానియా మీర్జా 464, N. సువర్ణ 432 మార్కులు సాధించారు. వీరిని గౌతమీ విద్యాసంస్థల చైర్మన్ కే.గుండారెడ్డి, సీఈవో నాగేంద్రబాబు,ప్రిన్సిపాల్ రామయోగి, అధ్యాపకులు అభినందించారు.
Latest News
14 Feb 2025 14:44 PM