AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు అంశాలపై PMతో చర్చించనున్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరనున్నట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.
తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్తో కలిసి ఉదయం 3.27 నిమిషాలకు భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరు ప్రయాణించే వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో గల సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉ. 8:15 గంటలకు వీరి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
AP: మెడికల్ కాలేజీలకు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసిందని, ఇప్పుడు బడుల వంతు అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. 'అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ముందే మీరు చెప్పారు లేండి. తప్పు మీది కాదు.. తప్పంతా EVMలదే. 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా? గ్రామంలో ఎన్ని బ్రాందీ, బెల్ట్ షాపులైనా ఉండొచ్చా?' అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.
SC వర్గీకరణ.. మిశ్రా కమిషన్ నివేదికకు క్యాబినెట్ ఆమోదం
AP: SC వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దీనిపై TDLPలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్గా వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకోవాలన్నారు. సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు MLAలు అంగీకారం తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జిదారులను కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రత్యేక సిబ్బందిని కలెక్టర్ నియమించారు
రాజ్యసభ సభ్యుడు ఒంగోలు మాజీ ఎంపీ YV సుబ్బారెడ్డి తల్లి ఏరం పిచ్చమ్మ పార్థివదేహానికి సోమవారం YS విజయమ్మ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పిచ్చమ్మతో ఉన్న అనుబంధాన్ని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ అంత్యక్రియలు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి.
మాజీ సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయలుదేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహానికి జగన్ నివాళులు అర్పించనున్నారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. 'లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు'ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.
YV సుబ్బారెడ్డి తల్లికి బాలినేని నివాళులు
YV సుబ్బారెడ్డి తల్లి సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి, వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి మాతృమూర్తికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలు పిచ్చమ్మ బాలినేని శ్రీనివాసరెడ్డికి వరుసకు అత్త అవుతారు.
AP: సినీ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయనను GGHకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయంలో సాయంత్రం 5 గం. వరకు విచారించనున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్లను దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
• టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
• అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
✓YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు
నంబూరులోని VVITకి ప్రైవేట్ వర్సిటీ హోదా
AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప
మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా. 5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
పడమర లక్ష్మీపురంలో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దొనకొండ మండలం, పడమర లక్ష్మీపురం గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం మరియు పడమర లక్ష్మీపురంలో గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సోమవారం అధికారులు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆరోగ్యానికి మంచిదని ఏవో ప్రసాదరావు తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు రాబడి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని రామచంద్రపురంలో సోమవారం ప్రమాదవశాత్తు పక్క పక్కనే ఉన్న 4 పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకటరావు, ఆదిలక్ష్మి, ఆదేమ్మ, మాలకొండయ్య, శ్రీనివాసరావు, మురళి, రామారావు, వెంకటేశకు చెందిన బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఈరోజు తాళ్లూరు మండలంలో 10 వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు
ఈరోజు 10 వ తరగతి పరీక్షలు మొదలు కావున తాళ్లూరు మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కలిపి 818 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉడగా 808 మంది విద్యార్థులు హాజరు కాగా 10 మంది విద్యార్థులు మాత్రం పరీక్షా కేంద్రాలకు హాజరు కాలేదు.
AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. '2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు' అని ఆయన ఫైర్ అయ్యారు.
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపల మడుగు కొత్తపల్లికి చెందిన వృద్ధుడు కోటయ్య కన్న కొడుకు గెంటేశాడని మార్కాపురం సబ్ కలెక్టర్ను ఆశ్రయించాడు. తన కొడుకు ఆస్తి మొత్తాన్ని తీసుకొని, అన్నం పెట్టకుండా గెంటేశాడని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్కు ఫిర్యాదు చేశాడు. గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని కోటయ్య వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ ఆఫీస్కు వచ్చాడు.
IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్ (C), లివింగ్టన్, జితేశ్ శర్మ, బెథెల్/ టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్ వుడ్, సుయాశ్.
సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ. 10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్మన్కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్కాస్ట్లో RSSతో అనుబంధం, భారత్కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
గుంటూరు: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన.
పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్స్ నెంబర్స్, రూమ్ నెంబర్స్ సరిగా లేవని విద్యార్థుల ఆందోళన.అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద క్లాస్ రూములకు తాళాలు కూడా తీయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు.
కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు.
ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు.
ఒంగోలులోని రామ్ నగర్ లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
పరీక్ష కేంద్రంలోని ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 183 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
బాపట్ల డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన యద్దనపూడి మండలం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది.. సంఘీభావం తెలిపిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్, ప్రజా సంఘాలు.
బీర్కూర్ : తాత్కాలిక నివాసం ఏర్పాటు కోసం వినతిపత్రం అందించిన బీజేపీ నాయకులు
అందరికీ నమస్కారం బీర్కూర్ గ్రామo లో నివాసం ఉంటున్న పిడుగు సాయవ్వ w/o గంగారాం, పిడుగు శాంతవ్వ w/0 బాబయ్య, పిడుగు గంగవ్వ మూడు కుటుంబాలు పోయిన నెల 27 వ తేదీన వారి మూడు ఇళ్లు విద్యుత్ ప్రమాదం తో ఇళ్లు పూర్తి గా కాలి పోవడం జరిగింది పూర్తి స్థాయిలో అస్తి నష్టం వాటిల్లింది వారికి ఉన్నడానికి ఇళ్లు కూడా లేదు కావున వారి కుటుంబానికి తక్షణ సాయం చేయాలి వారికి వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటికి వరకు ఉండడానికి వారికి తాత్కాలికంగా నివాసం ఉండడానికి స్థావరం ఏర్పాటు చేయాలి లేక పోతే బీర్కూర్ గ్రామo లో నిర్మించిన ఉన్న డబుల్ బెడ్ రూమ్ లో 3 ఇళ్ల నీ వాళ్లకు ఇవ్వాలి అని ఈ రోజు బిజెపి శాఖా ఆధ్వర్యంలో బాధితుల తో కలిసి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయాడం జరిగింది బాధితుల కు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారకు పోరాటం చేస్తామని బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి యోగేష్, బిజెపి సీనియర్ నాయకులు హన్మాoడ్లు, నూకల రాము, రాజు, సాయిబాబా, బస్వరాజు, ఆవారి శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు
10 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరూ మంచి మార్కులు సాధించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ ఆల్ ది బెస్ట్ చెప్పటం జరిగింది.
చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ 'ప్రజ్ఞాన్'ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్ను ప్రయోగిస్తామని చెప్పారు.
ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద చండ్రపాటి సత్యనారాయణ - రంగనాయకమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు చండ్రపాటి వెంకట రామమోహన్ రావు (రాంబాబు) - ఉదయలక్ష్మి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూర్లె రామసుబ్బారావు,జిట్టా శ్రీనివాసరావు,ఆర్.టి.సి డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ,వక్కల గడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
దర్శి: ఆపద సమయంలో మహిళల రక్షణకు శక్తి టీమ్ ఏర్పాటు
ప్రతి మహిళ, చిన్నారుల రక్షణ,భద్రత మొదట ప్రాధాన్యత అని, ఆపదలో ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా శక్తి టీమ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మహిళలు భద్రత,రక్షణకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు,బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా దర్శి సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం లో ఒక ఎస్సై, ముగ్గురు మేల్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఇంకా మద్దతు గా సబ్ డివిజన్ లో వున్న ఉమెన్ పీసీ లందరూ సపోర్ట్ గా వుంటారని తెలిపారు.ఎవరికైనా, ఎప్పుడైనా ఏదైనా ఆపద ఎదురైతే శక్తి యాప్ లో ఆప్షన్స్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చునని దర్శి డీఎస్పీ తెలిపారు.
హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన 'కోర్టు' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంగోలు రానున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ (84) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివ దేహాన్ని ఒంగోలు తరలిస్తున్నారు. దీంతో నివాళులు అర్పించేందుకు నేడు లేక రేపు ఒంగోలు జగన్ రానున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారని సమాచారం.
రాజ్యసభ సభ్యుడు, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఆమె మృతిపై పలువురు సంతాపం తెలిపారు. కొన్ని రోజులుగా ఎర్రం పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. పిచ్చమ్మ అంత్యక్రియలు ఈరోజా రేపా అనేది కుటుంబం సభ్యుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రూ.250 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక వచ్చిందని తెలిపారు. 564 మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల చేస్తామని చెప్పారు.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ సెలవు ఉంది. రంజాన్ హాలిడేలో ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. అంటే మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. అటు తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
మార్చి 17, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మగ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇషా: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.
AP: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న
విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించి కష్టపడి పని చేయండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే విజయం వెంటాడుతుందని గుర్తుంచుకోండి' అని ట్వీట్ చేశారు.
గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.
కంభం పట్టణంలో పాత్రికేయులను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో వారి ఫోటోలతో సహా పెట్టి దూషిస్తున్న మహిళ, ఆమె భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగతంగా దూషించటం నేరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు.
దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామం టిడిపి నాయకులు శ్రీనివాసరెడ్డి కుమార్తె ఇటీవల యాక్సిడెంట్ కు గురై గుంటూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలు, ట్రీట్ మెంట్ విధానం తెలుసుకొని అక్కడి డాక్టర్స్ తో మాట్లాడి...పార్టీ అండగా ఉంటుందని, అన్నీ విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.
ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అల్ట్రా, పల్లె వెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అధికారి వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌలభ్యం ఆర్టీసీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.