దర్శి లో హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టిన బేజేపీ నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆదేశాల ప్రకారం దరిశి రూరల్ మండలాధ్యక్షుడు నాగసాయి పట్టణ అధ్యక్షుడు అమరేశ్వర రావు యువమోర్చా నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో దర్శి లోని గంగవరం రోడ్డు నుంచి అద్దంకి NSP కాలనీ వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యార్థులతో జాతీయ జెండాలు చేతపట్టి వందేమాతరం భారత్ మాతాకీ జై అని నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి దర్శి నియోజకవర్గ కన్వీనర్ మాడపాక శ్రీనివాసులు, గురువర్దన్ రావు, బచ్చు అనిల్, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.