వలేటి వెంకట్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన గొట్టిపాటి లక్ష్మీ, లలిత్ సాగర్
ఆదివారం రాత్రి ముండ్లమూరు మండలం, ఉల్లగళ్లుగ్రామం లో వినాయక నిమజ్జనం సందర్బంగా టిడిపి యూనిట్ ఇంచార్జ్ వలేటి వెంకటేశ్వర్లు మృతి చెందగా విషయం తెలుసుకున్న దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు సోమవారం ఉల్లగల్లు గ్రామానికి వెళ్లి వలేటి వెంకటేశ్వర్లు భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేసారు. డా|| లక్ష్మీ తో పాటు మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను, మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, ఉల్లగల్లు గ్రామ టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు.