రాష్ట్రంలో ఉర్దూ భాష లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారా ? సయ్యద్ సలావుద్దీన్
మాతృభాషలో విద్యను అభ్యసించడం ఆయా వర్గాల యొక్క హక్కు. ఆ హక్కును గత ప్రభుత్వం కాలరాస్తున్నదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్ద పెద్ద నాయకులు గగ్గోలు పెట్టినారు అని ప్రముఖ సంఘ సేవవాకులు ముస్లిం స మైక్యా వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ పత్రికా ముఖముగా ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర విద్యాధికారులను అడుగుతున్నారు. ఆ నాయకులు ఆయా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తామని ప్రగల్ఫాలు పలికినారు. చాలామంది తల్లిదండ్రులు విద్యావేత్తలు మేధావులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టినారు. ఫలితంగా గత ప్రభుత్వము ఉర్దూ మధ్యమ పాఠశాలల జోలికి రాలేదు. అవి ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగుతున్నాయి. మరి ప్రస్తుత ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఎందుకు చేస్తున్నది? జిల్లాల ఉప విద్యాశాఖాధికారులు ఉర్దూ మాధ్యమ పాఠశాలకు వెళ్లి, అక్కడి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉర్దూ భాషను తక్కువ చేసి చూపుతూ, ఉర్దూ భాషలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ఉన్నత విద్యను చదవలేరని వారిలో ఉర్దూ భాష పట్ల నెగటివ్ భావాలను పెంపొందిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. అదేవిధంగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిస్తూ తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి అందులో ఉర్దూ మాధ్యమం అవసరం లేదు ఇంగ్లీష్ మద్యంలోకి మార్చాలని రెజిల్యూషన్స్ పాస్ చేయించి పంపించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనినేను ఖరాఖండిగా ఖండిస్తున్నానని సలావుద్దీన్ పత్రిక ముఖముగా ప్రకటించినారు. కావున ప్రభుత్వము మరియు విద్యాశాఖ అధికారులు ఇలాంటి ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని ఉర్దూ మాధ్యమం పాఠశాలలను అదేవిధంగా మైనర్ విభాగపు పాఠశాలను యధా విధంగా కొనసాగించాలని గట్టిగా కోరుతున్నాను. లేనిపక్షంలో ఉద్యమం నడిపించ వలసి వస్తుందని సంఘసేవకులు, ముస్లిం సమైక్యా వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలవుద్దీన్ గారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో ముస్లిం సమైక్యవేదిక రాయలసీమ ఇంచార్జ్ షేక్ అలీషేర్, గోల్డ్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు