నిడమర్రులో రాష్ట్ర సెర్ప్ స్ట్రీనిధి మహిళ బ్యాంక్ విజిలెన్స్ టీమ్ పర్యటన
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చిననిండ్రకొలను వీఓలో రాష్ట్ర సెర్ప్ స్ట్రీనిధి మహిళ బ్యాంక్ విజిలెన్స్ టీమ్ శనివారం పర్యటించింది. జిల్లాలో వరుసగా 10 మండలాల్లో నిర్వహిస్తున్న పరిశీలనలో భాగంగా ఈ పర్యటన జరిగింది.విజిట్ సందర్భంగా 24-25, 25-26 సంవత్సరాల స్ట్రీనిధి లోన్ డాక్యుమెంట్లు, SHG తీర్మానాలు పరిశీలించబడ్డాయి. ప్రత్యేకంగా 49 మంది స్ట్రీనిధి లోన్ సభ్యుల ఖాతాల్లోకి లోన్ అమౌంట్లు సరిగా జమయ్యాయా లేదా అన్న విషయాన్ని వెరిఫై చేశారు.
సభ్యురాళ్లతో ప్రత్యక్షంగా మాట్లాడి —
1. తీసుకున్న రుణం,
2. ప్రస్తుతం కొనసాగిస్తున్న జీవనోపాధి,
3. చెల్లించవలసిన వాయిదాలు,
4. ఇప్పటివరకు చెల్లించిన వాయిదాల స్థితి వంటి అంశాలను పరిశీలించారు.
అదేవిధంగా స్ట్రీనిధి లోనింగ్ మరియు బ్యాంక్ లింకేజీ మధ్య తేడాలను వివరించారు. స్ట్రీనిధి రుణాల వడ్డీ రేటు తక్కువగా (92 పైసలు), సురక్ష ఇన్సూరెన్స్ కలిగివుండటం, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకపోవడం, 24 గంటల్లో లోన్ మంజూరు అవ్వడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని సభ్యులకు తెలియజేశారు.
స్ట్రీనిధి విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణం నాయుడు మాట్లాడుతూ — ప్రతి నెలలో స్ట్రీనిధి రుణాలు తీసుకున్న గ్రూపుల రికవరీలను సిబ్బంది తప్పనిసరిగా వెరిఫై చేయాలి. రాష్ట్రంలో ఇతర ఏ బ్యాంక్ కూడా ఇవ్వని విధంగా ఒక్కో గ్రూప్‌కి రూ.5 లక్షల వరకు రుణాలు స్ట్రీనిధి మహిళా బ్యాంక్ అందిస్తోంది. గ్రామాల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంపుదల కోసం, ఇంకా మెరుగైన మార్పుల కోసం ఈ విజిట్లు కొనసాగుతున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్ట్రీనిధి AGM చెన్న కేశవులు, ఏరియా మేనేజర్ నరేంద్ర, APM ఎం. రత్నకుమార్, క్లస్టర్ CC ఆర్. గౌరీశంకర్, వీఓఏ చొక్కాకుల లక్ష్మీ, క్లస్టర్ వీఓఏలు మరియు రుణాలు పొందిన సభ్యులు పాల్గొన్నారు.