ఇమామ్ మౌజనులకు గౌరవ వేతనాలు అమలు చేయాలని డిమాండ్: గులాం రసూల్
ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం మైనారిటీలు..
వైసిపి రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ కామెంట్స్..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాల కోసం పోరాటం చేపట్టాం..
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విషయంలో ద్వంద వైఖరి అవలంబిస్తుంది..
వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయటం జరిగింది..
కరోనా వైరస్ విపత్తు సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అందజేసి ఆదుకున్నారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయకుండా ముస్లిం మైనార్టీలను చిన్నచూపు చూస్తుంది..
ఎలాంటి ఉపాధి లేకుండా కేవలం ఆధ్యాత్మికంగా ఇమామ్, మోజన్లు జీవనం సాగిస్తున్నారు..
ముస్లిం మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది..
బిజెపి కను సన్నల్లో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది..
ముస్లిం మైనారిటీ మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన బుర్కా ను హేళన చేసే విధంగా భాష్యం విద్యాసంస్థల్లో ఓ పురుషుడికి బుర్కా ధరించి అవహేళన చేసే విధంగా నృత్యాలు చేపించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం..
తక్షణమే భాష్యం రామకృష్ణ స్పందించి ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి..
లేనిపక్షంలో భాష్యం విద్యా సంస్థల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తాం..అని హెచ్చరించారు.