దరిశి కోర్టుల పరిధిలో పారా లీగల్ వాలీంటీర్గా కపురం శ్రీనివాసరెడ్డి నియామకం.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్నీకోర్టుల పరిధిలలోని ఎంపిక కాబడిన 35 మంది పారా లీగల్ వాలీంటర్లకు సోమవారం సాయంత్రం వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ శిక్షణాతరగతులు నిర్వహించి, పారావాలీంటీర్ల విధి విధానాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చాంబర్లో నిర్వహించడం జరిగింది.
బాలకార్మికులను,వరకట్న బాధితులను,నిరుపేదలై, న్యాయ సహాయం అందనివారిని,బాల్యవివాహాలను,బాలనేరస్తులను అరికట్టడంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా బాధితులకు స్వచ్ఛందంగా న్యాయ సేవాధికార సంస్థకు పారాలీగల్ వాలీంటీర్లందరూ సహకరించాలని జిల్లా జడ్జీ షరీఫ్ శిక్షణలో భాగంగా తెలిపారు.
ఈ సందర్భంగా శిక్షణా శిభిరంలో జడ్జి ఇబ్రహీం షరీఫ్ తో కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..., ప్రకాశం జిల్లా ఐఆర్సీయస్(రెడ్ క్రాస్ సంస్థ)కు ఈసీ మెంబరుగా, ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థకు ప్రధాన కార్యదర్శిగా అనేక కార్యక్రమాలను నిస్వార్థంగా, ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా నిరుపేదలకు సేవజేస్తున్నామని, దీనిలో కూడా ఏలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిరుపేదలకు న్యాయ సహాయం అందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జడ్జికి వివరించానని కపురం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.