జ్వరాల నేపథ్యంలో దర్శి ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జ్వరాలు అధికంగా ఉన్న సీజన్లలో రోగులకు అందుతున్న సేవలపై దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దృష్టి సారించి గురువారం ఉదయం ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపర్నెంట్ డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు.ఆస్పత్రిలో వైద్య సేవలపై డాక్టర్ లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో CI రామారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు తదితరులు ఉన్నారు.