తెలంగాణ: GHMC కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన మీర్ హాదీ అలీ
రంగారెడ్డి జిల్లా ఈస్ట్ జోన్ జిహెచ్ఎంసి పరిధిలోని హయత్ నగర్ లో గల సత్యనారాయణ కాలనీ లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని 1, 2, 4, 5 రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానం గా తయారయ్యాయని ఈ ప్రాంతంలో దర్గా, మస్జిద్ లకు అధిక సంఖ్యలో వస్తున్న ప్రజలు ఈ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారని త్వరగా రోడ్లు నిర్మాణం చేపట్టాలని ఆయన జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటివ్ కు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీర్ హాదీ అలీ వినతిపత్రం అందజేశారు, త్వరలోనే రోడ్ల నిర్మాణానికి కావలసిన నిధులు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన భరోసాని ఇచ్చారు.