No.1 Short News

Newsread
Oyo: డిగ్రీ కూడా చదవని కుర్రాడి 60 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్య సక్సెస్ సీక్రెట్
ఓయో రూమ్స్... డిగ్రీ కూడా చదవని కుర్రాడి 60 వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం వెనకున్న ఒకే ఒక సక్సెస్ సీక్రెట్. ఓయో (OYO)... ఈ బోర్డు చూస్తే మీ మనసులో ఏమనుకుంటున్నారో పెద్దగా ఆలోచించకుండానే చెప్పొచ్చు. అవన్నీ పక్కన పెడితే అసలు ఓయో గురించి మీకు ఏమి తెలుసు? పేరు చూసి ఉబెర్ లా ఇదేదో విదేశీ కంపెనీ అనుకుంటున్నారు కదా? కానీ కాదు ఒక ఇండియన్ కంపెనీ. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా ఇది మొదలుపెట్టిన వాడు ఒక 19 ఏళ్ళ కుర్రోడు. ఇప్పుడు ఓయో వ్యాపార సామ్రాజ్యం విలువెంతో తెలుసా 60000 కోట్లకు పైమాటే. ఈ స్టోరీ చదివితే మీకు మరిన్ని ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తాయి... రితేష్ అగర్వాల్...ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు. సొంతూరు ఒడిస్సా రాష్ట్రంలో రాయగఢ్. ఇతనేమీ పెద్దగా చదువుకో లేదు. సరిగా చెప్పాలంటే డిగ్రీ కూడా పూర్తిచేయలేదు. పోనీ బ్యాక్ గ్రౌండ్ గట్టిదేమో అనుకుంటే నాన్న ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవాడు. ఇతను 13 ఏళ్ళ వయసులోనే కుటుంబానికి సహాయపడటానికి సిమ్ కార్డులు అమ్మేవాడు. మెల్లగా డిగ్రీ వరకు గెంటుకొచ్చినా ఈ చదువు కొనసాగించేలేక బిజినెస్ మీద దృష్టి సారించాడు. తను పని మీద ఒక రోజు రాత్రి హోటల్ లో స్టే చెయ్యాల్సి వచ్చినప్పుడు ఎదుర్కున్న పరిస్థితులే అతనికి ఈ వ్యాపారం లో అడుగుపెట్టేలా ప్రేరేపించాయి. దాంతో అతను ముందుగా oravel stays అనే ఒక బుకింగ్ వెబ్ సైట్ ను మొదలుపెట్టాడు. అందులో అందుబాటు ధరల్లో ఉండే హోటళ్ల లిస్ట్ ఉండేది. అయితే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి డబ్బు లేకపోవడం తో ఇబ్బందిపడేవాడు. అదే సమయంలో కొత్తగా స్టార్ట్ అప్ లను పెట్టి వ్యాపారవేత్తలు కావాలనుకునే వారికోసం Pay Pal ఓనర్ ఇచ్చే లక్ష డాలర్ల Theil Fellowship గెలుచుకుని ఆ పెట్టుబడితో వ్యాపారాన్ని వృద్ధి చేసాడు. అలా 2013 లో మొదలయ్యింది ఓయో ప్రస్థానం. మొదటగా ఇక్కడ బడ్జెట్ హోటల్ లలో ఉండే సమస్యలు అర్థం చేసుకున్నాడు రితేష్. తక్కువ కాస్ట్ హోటల్స్ లో ఉండే అతిపెద్ద సమస్య శుభ్రత లేకపోవడం. సో దానిమీద దృష్టిపెట్టాడు. మొదట్లో తనవద్ద లిస్టయిన హోటల్స్ తో రెవిన్యూ షేరింగ్ పార్టనర్ షిప్ తీసుకునేవాడు రితేష్. వాటిల్లో కావాల్సిన మార్పులు చేసేవాడు. వాటర్, నీట్నెస్, ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వడం లాంటి సౌకర్యాలతో పాటు ఈజీ గా బుక్ చేసుకునే అవకాశం కలిపించాడు. లోకల్ ఐడెంటిటీ కార్డులతో ఎవరైనా జంటలు ఈజీ గా రూమ్ బుక్ చేసుకునే ఫెసిలిటీ కలిపించాడు. దాంతో ఓయో సక్సెస్ మొదలయ్యింది. ఓయో లో లిస్టయిన హోటల్స్ కి రెవిన్యూ, బుకింగ్స్ పెరగటంతో ఓయో తో పార్టనర్షిప్ కోసం మరిన్ని హోటల్స్ ముందుకొచ్చాయి. దాంతో కంపెనీ 2015 నాటికి దూసుకుపోయింది. అప్పుడు ఈ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకు నుంచి ఫండింగ్ తీసుకుని వరల్డ్ మార్కెట్ మీద కన్నేశాడు రితేష్. ఎప్పటికప్పుడు తన వ్యాపార స్ట్రాటజీ ని మార్చుకుంటూ దూసుకెళ్లాడు. బుకింగ్స్ తో సంబంధం లేకుండా నిమం గ్యారంటీ ఇన్కమ్ వంటి కొత్త కొత్త పధకాలు పెట్టి పార్టనర్స్ ను పెంచుకున్నాడు. 2018 నుండి సర్వీస్ అపార్ట్మెంట్స్ అండ్ కార్పొరేట్ స్టే లపై దృష్టిపెట్టింది. ఇప్పుడు ఓయో రూమ్స్ ప్రపంచం లో దాదాపు 80 కంటే ఎక్కువ దేశాల్లో పాతుకుపోయింది. 40 వేల హోటల్స్ 17 వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక పెట్టుబడిదారులు కూడా పెరిగారు. ఈలోగా కోవిడ్ రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. దాంతో వ్యాపారం పూర్తిగా దెబ్బ తినిపోయింది. మరోవైపు IPO కు వచ్చినా సెబీ ఎంక్వయిరీ కి ఆదేశించడం వంటి కారణాలతో IPO నుండి వెనక్కు తగ్గింది. కంపెనీ పనైపోయిందనుకున్నారందరూ. మరో బైజూస్ లా ఓయో కూడా మునిగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో లాభాలు ఇవ్వని హోటల్స్ ను వదిలించుకుని. మళ్ళీ రెవిన్యూ షేరింగ్ లో కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. ఎందుకు ఓయో ఇంత సక్సెస్ అయిందంటే: దీనివెనుకున్న మాస్టర్ మైండ్ ఓన్లీ రితేష్ అగర్వాల్. ఎప్పటికప్పుడు మార్కెట్ అర్థం చేసుకుంటూ ముందుకు సాగటమే అతని సక్సెస్ సీక్రెట్. ఒకప్పుడు హోటల్స్ లో జంటలు స్టే చేస్తే రైడింగ్ లాంటి ఇబ్బందులు ఉండేవి. దాంతో అందరికి భయం ఉండేది. అయితే ఓయో రూమ్స్ లో అటువంటి ఇబ్బందులు ఉండకపోవడంతో కపుల్స్ కు ఓయో రూమ్స్ స్వర్గంలా మారాయి. దాంతో వారు ఎక్కువగా రావడంతో ఓయో మీద కేవలం పెళ్లికాని యువతకే అనే ముద్రపడిపోయింది. కానీ ఇది నిజం కాదు. ఓయో రూమ్స్ ఎక్కువగా టెంపుల్స్ ఉండే ప్రాంతాల్లో బుకింగ్స్ ఎక్కువగా అవుతాయట. కేవలం జంటలకు ఇవ్వడమే ఓయో సక్సెస్ కు రీజన్ కాదు. ఎప్పటికప్పుడు బిజినెస్ స్ట్రాటజీ మార్చుకోవడం, గెస్టులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఇలా ప్రతీ విషయంలో ఉండే కేర్ ఈ రోజు ఓయో ను ఈ స్థాయి లో నిలబెట్టింది. మరోపక్క ఫ్యామిలీలను మరింతగా హోటల్స్ కు వచ్చేలా చెకిన్ పాలసీ నీ మార్చింది. పార్టనర్ హోటల్స్ ఓకే అయితేనే జంటలకు రూమ్ ఇవ్వొచ్చు అని కొత్త నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనలు దేశంలో ఉన్న అన్ని హోటల్స్ కు వర్తించవు. సో ఇది ఒక డిగ్రీ కూడా చదవని ఒక కుర్రోడి విజయగాధ. ఇతని విజయం ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కూడా ఆశ్చర్యపరిచింది. 2020 లో ఇండియా కు వచ్చినప్పుడు ( అప్పుడు ట్రంప్ అధ్యక్షుడు కాదు) నీది చిన్న కంపెనీ కాదు రితేష్, గుడ్ జాబ్ అని పొగిడేలా చేసింది. వ్యాపారం చేయాలంటే డబ్బే కావాలనే ఆలోచన కంటే వ్యాపారం చెయ్యాలంటే కావలిసింది ఒక కొత్త ఆలోచన అనే విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన బిజినెస్ మెన్. సో వ్యాపారమే మీ టార్గెట్ అయితే ఈ సక్సెస్ స్టోరీ నుండి మీరు నేర్చుకొవలిసింది చాలా ఉంది కదా. ఏమంటారు? ఇంతకీ OYO అంటే ఏంటో తెలుసా On Your Own!
Motivation
24 Sep 2025 06:43 AM
1
74






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (802)
  • Motivation (11)
  • Crime News (25)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (217)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.