ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఇద్దరు వ్యాపారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని లక్షల 40 వేలు పోగొట్టుకున్నారు. తాళ్లూరు కు చెందిన ఒక వ్యాపారికి ఫోన్ చేసి తాము పోలీసులమని చెప్పి 75000 ఫోన్ పే చేస్తే వెంటనే నగదు అందజేస్తామని నమ్మించాడు. దీంతో ఆ వ్యాపారి సైబర్ నేరగాడు తెలిపిన ఫోన్ నెంబర్కు 75000 పంపించాడు. ఇదే రీతిలో కొత్తపాలెం కి చెందిన మరో వ్యాపారికి కాల్ చేసి 65000 బ్లాక్ చేశారు తర్వాత నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు, స్పందించిన పోలీస్ సిబ్బంది కొల్లగొట్టిన నగదును సైబర్ నేరగాళ్లు డ్రా చేసేందుకు వీల్లేకుండా బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయించి విచారణ చేపడుతున్నారు.