ఎరువుల దుకాణాలపై తనిఖీలు – యూరియా నిల్వలు గుర్తించిన ప్రకాశం పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, పోలీసులు జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో యూరియా నిల్వలు గుర్తించారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అక్రమంగా నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతుల ప్రయోజనాల రక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం పోలీసులు తెలిపారు.