Darsi: దీన్ దయాల్ ఉపాధ్యాయ 110 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఈరోజు దర్శి లో బీజేపీ పార్టీ ఆఫీసు నందు జనసంఘ వ్యవస్థాపకులు పూజ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 110 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగులో ఉన్న వ్యక్తికి తొలి ప్రభుత్వ ప్రయోజనం చేకూరాలని అంతోదయ ప్రేరణలో భారత సమగ్ర అభివృద్ధికైకృషిచేసిన స్ఫూర్తిదాత ఏకాత్మే మానవత వాదంగా ప్రవచించి అంత్యోదయ విధానాన్ని రూపొందించిన ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ అధ్యక్షుడు వల్లభ వరపు అమరేశ్వర రావు, మాడపాకుల నారాయణమ్మ , వెంకటసుబ్బయ్య, అచ్యుత గురువర్ధన్ రావు, అనిల్ పాల్గొన్నారు