దర్శి: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి:
ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పరిమళ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో దర్శి మండల పరిధిలోని అంగన్ వాడి సూపర్ వైజర్ లు అంగన్ వాడి కార్యకర్తలతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రస్తుతం వర్షాలకు సంభవించే అంటూ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ వేడిచేసిన మంచినీళ్లు త్రాగాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబల కుండా ఆరోగ్యశాఖ వారు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని ఆశ వర్కర్లకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్ వైజర్ లు ఆర్. ఆనందలత, రమాదేవి, మండలంలోని అందరూఅంగన్ వాడి కార్యకర్తలు ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు