ప్రకాశం: నేరాల నివారణకు పహారా, FINS సిస్టమ్ తో పటిష్ట నిఘా
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు జిల్లా వ్యాప్తంగా కఠిన పహారా నిర్వహిస్తున్నారు. Fingerprint Identification Networking System (FINS) ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై విచారణ చేసి వారి వివరాలను FINS సిస్టమ్‌లో ధృవీకరిస్తున్నారు. ప్రతి పట్టణం, గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాలు, హాట్‌స్పాట్‌లలో పోలీసు బృందాలు గస్తీ తిరుగుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాయి. క్రైమ్ కంట్రోల్‌లో ఆధునిక టెక్నాలజీని వాడుతూ ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. పోలీసుల క్రమమైన పర్యవేక్షణ వల్ల నేరగాళ్లకు తావులేకుండా నిరంతర భద్రతా వాతావరణం ఏర్పడుతోంది.
ప్రకాశం పోలీసుల హెచ్చరిక:
నేరాలకు పాల్పడే వారిపై ఎటువంటి కనికరము ఉండదు. కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.
ప్రజలకు విజ్ఞప్తి:
సమాజ శాంతి భద్రత కోసం పోలీసులకు సహకరించండి. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించవలసిందిగా తెలియచేశారు.