ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భేటీ
నూతనంగా కలెక్టర్ గా నియమితులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గురువారం తాళ్లూరు ఎంపీపీ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు ని పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ సమస్యలపై డాక్టర్ లక్ష్మీ కలెక్టర్ తో కొద్దిసేపు చర్చించారు....
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ తో చర్చించారు.. దర్శి లో గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన సందర్బంగా డా|| గొట్టిపాటి లక్ష్మీ దర్శి పట్టణంలో వాటర్ స్కీం ఫిల్టర్ బెడ్ల సమస్య CM కి తెలియజేయగా... వాటర్ స్కీం ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి మూడున్నర కోట్ల నిధులు మంజూరైనట్లు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ కి తెలిపారు. దీనిపై డాక్టర్ లక్ష్మీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి, కలెక్టర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వెంటనే పనులు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. దర్శి పట్టణంలో ఫిల్టర్ బెడ్లను నిర్మాణం పూర్తి చేస్తే తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందన్నారు. అదేవిధంగా గ్రామాలకు తాగునీరు వెళ్లే ఫిల్టర్ బెడ్ రూమ్ కూడా త్వరలో పూర్తి చేయాలని కలెక్టర్ కి డాక్టర్ లక్ష్మి విన్నవించారు.
తూర్పు వీరాయపాలెం గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చివరిదిశ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తూర్పు వీరాయపాలెం గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టాల పంపిణీ, రోడ్డు నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
డిగ్రీ కాలేజీ నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాల పై కలెక్టర్ గారితో గారితో చర్చించారు. దర్శి లో యోగ డే సందర్బంగా అధ్యాపకులు, విద్యార్థుల కోరికమేరకు దర్శి ప్రభుత్వ హై స్కూల్ - జూనియర్ కళాశాల లో ఫ్లోరిగ్ సమస్య ని కలెక్టర్ తెలియజేయగ త్వరలో సమస్యను పరిషరించాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి ప్రారంభించుట,
• గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో కొండ వైపు రోడ్డు పాడైందని వెంటనే తిరిగి నిర్మించాలని డాక్టర్ లక్ష్మీ కలెక్టర్ ను కోరగా హైవే అధికారుల తో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మించాలని హైవే అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
• అదేవిధంగా రైతులు పంట సాగు కోసం తూముల వద్ద పైపులు పూడి పోయాయని డా|| లక్ష్మీ కోరగా వెంటనే వాటిని కూడా పునర్నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు.
• ఎస్సీ కాలనీలకు రోడ్ల నిర్మాణం, తదితర సమస్యల గురించి కలెక్టర్ తో సుదీర్ఘంగా చర్చించారు. దర్శి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు మేడం వెంకటేశ్వర్ రెడ్డి మరియు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.