రాష్ట్రంలో బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరు: గులాం రసూల్
సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణను మించిన సైకో రాష్ట్రంలో మరొకరు లేరని ఆయనకు ఇప్పటికే మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ ఫైర్ అయ్యారు. అసలు జనంలోకి వస్తే సైకోలా వ్యవహరించేదెవరో అందరికీ తెలుసని బాలకృష్ణ పై ఆయన మండిపడ్డారు. వైయస్ జగన్ పై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గులాబ్ రసూల్ మాట్లాడుతూ బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ఎమ్మెల్యే బాలకృష్ణ మనసులో ఏదో బాధ ఉన్నట్లు ఉంది అని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఇచ్చే ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదన్న బాధ, లేకపోతే మరేదో ఉందని దానివల్లే నిండు అసెంబ్లీలో సైకో అనే పదం బాలకృష్ణ చెబుతున్నారని అసలు సైకో బాలకృష్ణ కే సరిపోతుందని అన్నారు. బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఆ కేసు నుండి బయటపడిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు . నందమూరి బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని ఆయన వెంటనే ఆసుపత్రిలో చూపించుకోవడం మంచిదని అన్నారు. వైయస్ జగన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిజమైన నాయకుడిగా ఉన్నారని బాలకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అని గులాం రసూల్ హెచ్చరించారు.