SP Vidyasagar Naidu: సరైన పద్ధతి కాదు.. మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ సీరియస్..
మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఎస్పీ చెప్పుకొచ్చారు. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు పేర్కొన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు.