Wednesday, March 27, 2024

అయ్యబాబోయ్ ఇదేమి ఎండ…

న్యూస్ రీడ్ (స్టోరీ) : జిల్లావ్యాప్తంగా రోజురోజుకు ఎండ తీవ్రత అధికం అవుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు బయట తిరగకూడదు అని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది. అత్యవసరం అయితే జాగ్రత్తలు పాటిస్తూ బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? అనే అంశంపై న్యూస్ రీడ్ స్పెషల్ స్టోరీ….

జాగ్రత్తలు ఇలా పాటించాలి…..
వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
1. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి.

2. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
3. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్ర పోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.

4. ఈ కాలంలో ఎక్కువుగా మజ్జిగ తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

5. ఈ వేసవిలో కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది.

6. శరీరంలో నీటిశాతం తగ్గటం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనిని నివారించాలంటే నీటిశాతం ఎక్కువుగా ఉండే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
7. ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular