Friday, April 19, 2024

అర్జీలను సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపించాలి : తిరుపతి కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి.

న్యూస్ రీడ్ (తిరుపతి): స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతo గా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జిల్లా జాయింట్ కలెక్టర్ డి. కె. బాలాజీ తో కలసి జిల్లా కలెక్టర్ స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి లు కోదండ రామిరెడ్డి, శ్రీనివాసులు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా:
రెవెన్యూ శాఖకు- 66, డి ఎం హెచ్ ఓ – 3, జిల్లా పౌరసరఫరాల శాఖ -2, పంచాయతీరాజ్ శాఖ – 7 , డి ఆర్ డి ఎ – 2, హౌసింగ్ – 1, పోలీస్ శాఖ – 2, మున్సిపల్ కార్పొరేషన్- 3, దేవాదాయ శాఖ -1, జిల్లా విద్యాశాఖ – 1, ఇరిగేషన్ – 1, ఎన్ హెచ్ ఐ – 1, కార్మిక శాఖ- 1, డ్వామా -1 లు కలిపి మొత్తం 92 వినతులు రావడం జరిగిందని జిల్లా అధికారులు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular