న్యూస్ రీడ్ (ఆంధ్రప్రదేశ్ ): బాధ్యతగా పనిచేయకపోతే కఠిన చర్యలుంటాయ్ అని కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్ లో ఆయన పలు శాఖల జిల్లా అధికారుల తో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రారంభించిన జగనన్న కు చెబుదాం కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రారంభించిన జగనన్న కు చెబుదాం కార్య క్రమం పైఅధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పని చేయాలని, స్పందన కార్యక్రమం లో భాగంగా అందిన అర్జీలను సకాలంలో నిర్ణీత గడువు లోపు నాణ్యతతో పరిష్కరించాలన్నారు.. నాణ్యమైన సేవల ను సంతృప్తి స్థాయి లో పరిష్కరించడం దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో గృహ నిర్మాణపురోగతి కి సంబంధించి సామూహిక గృహప్రవేశాలలో భాగంగా వారాంతపు లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు.క్షేత్ర స్థాయిలోత్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని,ఆర్ ఎల్ స్థాయి లో ఉన్న గృహాలు పూర్తి కావాలని,
ఇందుకు స్వయం సహాయక సంఘాలమహిళలకు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. జిల్లా లోని బిసి,ఎస్ సి, ఎస్ టి సంక్షేమ వసతి గృహాలలో మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యమునకు సంబంధించిన ఎటువంటి మరమ్మతులు ఉన్నా ఎంపీడిఓ లు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని మరమ్మత్తులను ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఎపిక్ కార్డు కు ఆధార్ అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయడం లో తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, ఈ ప్రక్రియలో వెనుకబడిన మండలాల తహసీల్దార్లు బి ఎల్ ఓ లతో సమన్వయం చేసుకొని ఈ అనుసంధాన ప్రకియ ను మరియు పెండింగ్ లో ఉన్న క్లైయిమ్ లు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు అయిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలనన్నారు.జాబ్ కార్డు కలిగి ఉన్న వారికి ఉపాధి హామీ పనులు కల్పించాలని,ఉపాధి హామీ పనులలో భాగంగా మండలాల కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నాడు -నేడు పనులకు సంబంధించి 10 కంపోనెంట్ లలో పనులు ప్రారంభo అయిన చోట పను లలో పురోగతి ఖచ్చితంగా ఉండాలన్నారు.పనులు నాణ్యత తో పూర్తి చేయాలన్నారు. జగనన్న తోడు కింద మండలానికి నిర్దేశిం చిన లక్ష్యాలను పూర్తి చేయాలని, బి ఎం సి యూ లలో పాల సేకరణ ను పెంచాలనితెలిపారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ ఎన్.రాజశేఖర్,హౌసింగ్ పిడి పద్మనాభం, జడ్పీ సిఈఓ ప్రభాకర్ రెడ్డి,ఇరిగేషన్,పిఆర్, ఆర్ & బి ఎస్ ఈ లు విజయ్ కుమార్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి, దేవానందం,డి ఆర్ డి ఎ, మెప్మా, డ్వామా పిడిలు తులసి, రాధమ్మ, గంగా భవానీ,
సమగ్ర శిక్ష ఎ పిసి వెంకట రమణా రెడ్డి,డిఇఓ విజయేంద్ర రావు, సంక్షేమ శాఖల అధికారులు రాజ్య లక్ష్మీ,నరసింహం,మూర్తి,చిన్నారెడ్డి
ఇతర సంబంధింత అధికారులు పాల్గొన్నారు.
బాధ్యతగా పనిచేయకపోతే కఠిన చర్యలుంటాయ్: జిల్లా కలెక్టర్ షన్మోహన్ వెల్లడి
RELATED ARTICLES