న్యూస్ రీడ్ (ఆంధ్ర ప్రదేశ్ ): డబ్బులు ఆశచూపించి అమాయక యువతులతో నగ్న పూజలు నిర్వహించడమే కాకుండా వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఆర్ధిక అవసరాలను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడిన వారిని పోలీసులు పట్టుకున్నారు. *అమ్మాయిలతో నగ్న పూజలు కథను ఛేదించిన పోలీసులు….అసలు ఏంటి అంటే స్టోరీ….*
సులభంగా డబ్బు సంపాదించేందుకు యువతులతో నగ్న పూజలు.పూజారి సహా 12 మంది అరెస్ట్.వ్యాపారంలో నష్టపోయిన చిలకలూరిపేట మహిళ.
-సోషల్ మీడియా ద్వారా పరిచయమైన పూజారి*
-నగ్నంగా పూజల్లో కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఆఫర్
-నంద్యాల జిల్లా నుంచి ఇద్దరు యువతలను తెప్పించిన వైనం.
-పూజల అనంతరం లైంగిక దాడికి యత్నం.
-తప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించిన యువతులు.
సులభంగా డబ్బు సంపాదించేందుకు యువతులతో నగ్నంగా క్షుద్రపూజలు చేయించిన ముఠాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తాటికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు పూజలు చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో నష్టపోయిన చిలకలూరిపేటకు చెందిన అరవింద అనే మహిళకు సోషల్ మీడియా ద్వారా అతను పరిచయమయ్యాడు.వ్యాపారంలో నష్టపోయిన అరవింద తన బాధలు నాగేశ్వరరావుకు చెప్పుకుంది. గుప్త నిధులు కనిపెట్టడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని, అందుకు యువతలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని పూజారి ఆమెకు చెప్పాడు. దీంతో అమ్మాయిల కోసం ఇద్దరూ గాలించారు. పూజల్లో నగ్నంగా కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఇద్దరూ కలిసి నాగేంద్ర అనే వ్యక్తిని ఆశ్రయించారు.దీంతో నాగేంద్ర.. స్నేహితుడు సురేశ్‌తో కలిసి నంద్యాల జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులకు డబ్బులు ఆశగా చూపి ఒప్పించి తీసుకొచ్చారు. అనంతరం పూజారి వారిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత యువతులపై పూజరి, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారు ఎదురు తిరగడంతో శనివారం కారులో ఎక్కించుకుని గుంటూరు వైపు బయలుదేరారు. కారు గోరంట్ల సమీపంలోకి రాగానే బాధిత యువతులు తప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూజారి, అతడి అనుచరులు సహా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతులతో నగ్న పూజలు : ముఠాను పట్టుకొని అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు. – ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నా పోలీసులు.
RELATED ARTICLES