Friday, March 29, 2024

ఏపీలో ఎన్నికల వేడి….?

న్యూస్ రీడ్ (స్పెషల్ స్టోరీ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందస్తు ఎన్నికల మూడ్ లోకి వెళ్తోందని అనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉండడంతో ఆయా పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు చర్యలు చేపడుతున్నారు.
విపక్షం అయితే ఎపుడైతే కరోనా రెండవ విడత తగ్గిందో నాటి నుంచే ఎన్నికల వేడిని రాజేయడం మొదలెట్టింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లాల టూర్లు చేపడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా తాము కాపు కాస్తామని అంటున్నారు. ఈ రోజుకు బీజేపీ జనసేన కూటమిగా ఉన్నా తొందరలోనే టీడీపీతో జత కడతాయని ఈ మూడూ కలసి కూటమిగా ముందుకు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఈ విషయంలో ఎక్కువగా అలెర్ట్ అవుతోంది వైసీపీ. ఒంటరి పోరు మాది అంటోంది. ఈ మాట చాలా సార్లు చెపింది.మళ్లీ మళ్లీ చెబుతోంది. సింహం సింగిల్ గానే వస్తుంది అని అంటోంది. మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతోంది. పేదల పక్షం మేమున్నామని కూడా అభయం ఇస్తోంది. ఇటీవల జగన్ స్పీచ్ లో….
ఇటీవల కాలంలో జగన్ తన స్పీచ్ లో స్టైల్ మార్చారు.పేదలంతా మా వైపు అంటున్నారు. అక్కడ ఆయన ఏ కులం గురించి మాట్లాడడం లేదు. పేదకులం అన్న ఒకే ఒక్క పాయింట్ ని పట్టుకుంటున్నారు. పేదలకు అండగా నేను ఉంటాను వారి సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం ఇంకా చేస్తామని చెబుతున్నారు. పేదలకు అన్యాయం జరగనివ్వను అంటున్నారు.
ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేక….
పేదలకు మేలు చేస్తూంటే పెత్తందారుల పక్షం ఉండే తెలుగుదేశం పార్తీ ఇతర విపక్షాలు అడ్డం పడుతున్నాయని కూడా ఆయన విమర్శిస్తున్నారు. పేదలంతా మళ్లీ నా వెనకే ఉండండి నాకు సైన్యంగా ఉండండి ఎలాంటి పొరపాటు జరగనీవద్దు. అదే కనుక జరిగితే మాత్రం ఎన్నడూ లేనంతగా నష్టపోవడం జరుగుతుంది అని జగన్ హెచ్చరిస్తున్నారు. విపక్షాల మాట విన్నారో పేదలే కనిపించకుండా పోతారని ఆయన అంటున్నారు.
సంచలనంగా మారిన ట్విట్టర్ పోస్ట్…
ఇక జగన్ తాను చెప్పిన మాటలను ఏపీ సమాజాన్ని పేదలు పెత్తందారులుగా వర్గీకరించి స్పీచులతో అల్లలాడిస్తున్న నేపధ్యంలో వైసీపీ అధికారిక ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ అయితే ఆసక్తిగానే కాదు సంచలనంగా మారుతోంది. ఆ పోస్టు లో మొత్తం నూటికి తొంబై శాతం ఉండే పేదలందరికీ తన వెనక ఉంచుకుని రెండు అరచేతులు పెట్టి వారిని కాపు కాస్తున్న జగన్ ఫోటో ఉంది.
జగన్ మీద సమరమే…
ఆయనకు ఎదురుగా పెత్తందరులతో కలసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తదితరులు అంతా జగన్ మీద సమరం చేస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టులో జగన్ ఫోటో పెద్దగా ఒక వీరుడిగా కనిపిస్తోంది. ప్రత్యర్ధుల ఫోటోలు చిన్నవిగా చీకటిలో బాణాలు వేసే వారిగా చిత్రీకరించడం జరిగింది. ఆకాశమంత ఎత్తులో జగన్ ఉంటే ఆయన చుట్టూ కాంతులు బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ చేస్తూ జగన్ అంటే వెలుగు అని జగన్ అంటే అండ అని జగన్ అంటే భరోసా అని ప్రజలకు అనిపించేలా ఈ ఫోటోను రూపొందించారు.
నిజంగా ఈ ఫోటో మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఫోటోకు కాప్షన్ ఏంటి అంటే పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని .అంటే పేదల కోసం ఒంటి చేతులతో జగన్ పోరాడుతున్నారు అన్న అర్ధం వచ్చేలా ఈ ఒక్క ఫోటోలో వేయి భావాలతో రూపొందించారు అన్న మాట.ఇది ఎన్నికల వేళ ఏపీ ప్రజలను ఆలోచింపచేసేలా ఉండేలా ఉంది అంటున్నారు. వైసీపీ ఈ రకంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఒక యుద్ధం స్టార్ట్ చేసింది అనే చెప్పాలి. ఇది ఆరంభం అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పోస్టులు మరిన్ని పెడతారు అని కూడా అంటున్నారు. మరి రానున్న ఎన్నికలలో పేద కులం గెలుస్తుందా. కులాల సంకుల సమరంగా మారిన ఏపీలో అన్ని కులాలలోని పేదలంతా జగన్ కి జై కొడతారా. జగన్ అలాగే జరగాలని లేవనెత్తిన క్లాస్ వార్ కి సక్సెస్ దక్కుతుందా లేదా ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular