Friday, March 29, 2024

గంగమ్మకు ఆభరణాల బహూకరణ

గంగమ్మకు ఆభరణాల బహూకరణ 15 May, 2023 ఆభరణాల ప్రదర్శనలో జాతర వంశ పారంపర్య ధర్మకర్త సీకేబాబు చిత్తూరు (న్యూస్ రీడ్): చిత్తూరు గంగమ్మ జాతర సందర్భంగా పలువురు అమ్మవారికి కానుకగా ఆభరణాలను సమర్పించారు. నగరంలోని గీతామందిరంలో ఆదివారం నడివీధి గంగమ్మ అలంకరణ ఆభరణాలను ప్రదర్శించారు. జాతర వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీ.కేబాబు ఆధ్వర్యంలో ఆభరణాలతో పాటు కొత్తగా చేయించిన మంగళసూత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో అత్యంత వైభవంగా జరిగే నడివీధి గంగమ్మజాతర వేడుకల్లో ప్రజలు ఉత్సహంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. కేవీఆర్‌ జ్యూవలర్స్‌ నారాయణమూర్తి రూ.3 లక్షలు విలువ చేసే తాళిబొట్టును విరాళంగా అందజేశారన్నారు. వేమా రెడ్డి అనే భక్తుడు రూ. 84 వేలు విలువ చేసే వెండి ఢమరుకం, సీఆర్‌సీ జ్యూవలర్స్‌ రవి రూ. 45 వేల వ్యయంతో ఫ్యాన్సీ అభరణాలు తయారు చేయించి అమ్మవారికి కానుకగా సమర్పించారని తెలిపారు. కొందరు సీలింగ్‌ఫ్యాన్లు, సోమ, మంగళవారాల్లో ఉచితంగా మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమా లు చేపడుతున్నట్లు సీకేబాబు వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular