Saturday, April 20, 2024

ప్రజల సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించండి : జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశం.

న్యూస్ రీడ్ (చిత్తూరు) : స్పందన కార్యక్రమంలో నమోదయ్యే ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని చిత్తూరు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పలు సమస్యలను అప్పటికప్పుడే క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజశేఖర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్పందన లో 294అర్జీలు నమోదు….
ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ శాఖకు సంబంధించి 200, హౌసింగ్ శాఖ 5, నగర పాలక సంస్థ 4, ఆర్ అండ్ బి 1, ఎస్ ఇ ఇరిగేషన్ 1,నేషనల్ హైవే1, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా మరియు వృద్ధుల సంక్షేమ శాఖ 1, ఎండోమెంట్ 1, మైన్స్ శాఖ 1 , హార్టి కల్చరల్ 1, డి పి ఓ 3, పోలీసు శాఖ 2, విద్యాశాఖ 2, వైద్య మరియు ఆరోగ్య శాఖ 2, ఎస్ ఇ గ్రామీణ నీటి సరఫరా1, పింఛన్లు,రేషన్ కార్డ్స్ 68, అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు డి.ఆర్.ఓ కు అంద జేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా డి.ఆర్.ఓను మరియు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular