Select Location
Newsread Image

No.1 Short News

Newsread
హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ
తెలంగాణ : నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. విశ్రాంతి కోసం జాతీయ రహదారి పక్కన ఆపిన లారీలో నుంచి సెల్ ఫోన్ డబ్బాలను దొంగలు ఎత్తుకెళ్లారు. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన సెల్ ఫోన్ల విలువ మార్కెట్లో సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ పోలీసులకు తెలియజేశాడు.
View More
Breaking News
12 Jul 2025 15:09 PM
0
117
Newsread Image

No.1 Short News

Newsread
ముండ్లమూరు: పోలవరం లో పోలీసుల దాడి 10 మంది అరెస్ట్.
ప్రకాశం జిల్లా: ముదురుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో, జిల్లా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, మార్గదర్శకత్వంలో, ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక దాడిలో జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో వారి వద్ద నుంచి రూ.10,190/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిపై సంబంధిత నేర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మరింత విచారణ కొనసాగుతోంది. పోలీసు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, ఇటువంటి చర్యలు ఇంకా కఠినంగా కొనసాగిస్తామని తెలిపారు.జనసామాన్యులు తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
View More
Breaking News
09 Jul 2025 07:27 AM
1
80
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఏపీలో ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ!
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులు రూ.528 కోట్లు ఉంటే.. వాటిలో రూ.350 కోట్లకు పైగా నిధులను వెండర్ల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.178 కోట్ల నిధులను బుధవారం విడుదల చేస్తారు. పది రోజుల్లో మరో రూ.672 కోట్లు విడుదల చేయనున్నారు. కేంద్రం నిధులు ఆలస్యం చేయడంతో గతేడాది డిసెంబర్ నుంచి బిల్లులు ఆగిపోయాయి. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన అనంతరం రూ.900 కోట్లు విడుదలయ్యాయి. తక్కువ చూపించు
View More
Breaking News
03 Jul 2025 08:25 AM
1
92
Newsread Image

No.1 Short News

Newsread
గుంటూరు లో విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై k. తరంగిణి
గుంటూరు, జూలై 2: నగరంలోని ఏటి అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై కె.తరంగిణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ తేడాలు, టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో, అలాగే సైబర్ క్రైమ్‌కు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. వ్యక్తిగత భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంచే విధంగా ఆమె ప్రసంగించారు. ఇలాంటి అంశాలపై మరింతగా తెలుసుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ఆమె కోరారు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డయల్ చేయాలన్న విషయాన్ని ఆమె ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భద్రతా పరంగా జాగ్రత్తలు పాటించేందుకు ఉపయోగపడిందని స్కూల్ సిబ్బంది పేర్కొన్నారు.
View More
Breaking News
02 Jul 2025 15:33 PM
0
72
Newsread Image

No.1 Short News

Newsread
AP Government: మందు బాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో శుభవార్తను అందించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం విధానాన్ని పునఃప్రవేశపెట్టింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అందుబాటులో లేని ప్రముఖ బ్రాండ్ల మద్యంను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రూ.99లకే క్వార్టర్ మద్యం బాటిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో పేద వర్గాల మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో శుభవార్తను అందించడానికి సిద్ధమవుతోంది. ఇకపై మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్‌ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ నుంచి మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. గతంలో అన్ని దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మార్పు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని దుకాణాలకు రూ.7.50 లక్షలు, మిగిలిన దుకాణాలకు రూ.5 లక్షల చొప్పున ఫీజులుగా ప్రతిపాదించారు. రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు ఉండగా, వీటికి రూ.5 లక్షల చొప్పున పర్మిట్ రూమ్‌ల ఫీజుల రూపంలో వసూలు చేస్తే రూ.186 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్పొరేషన్ల పరిధిలోని దుకాణాలకు అదనంగా రూ.2.5 లక్షలు వసూలు చేయడం ద్వారా పర్మిట్ రూమ్‌ల ద్వారా వచ్చే ఆదాయం రూ.200 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.
View More
Breaking News
01 Jul 2025 13:53 PM
1
75
Newsread Image

No.1 Short News

Newsread
నరసరావుపేటలో RMP వైద్యుడి నిర్వాకంతో చిన్నారి మృతి...
వాంతులు,విరేచనాలతో చిన్నారి ఆయేషా(5)ని RMP వద్దకి తెచ్చిన తల్లితండ్రులు... చిన్నారి ఆయేషాకి ఇంజక్షన్ ఇచ్చిన ఆర్.ఎంపీ వైద్యుడు.. ఇంజెక్షన్ చేసిన కొద్ది సేపటికే స్పృహ తప్పి కింద పడిపోయిన ఆయేషా... నరసరావుపేట లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి...RMP వైద్యుడు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రుల ఆరోపణ...నరసరావుపేట పెద్ద చెరువులో ఉన్న RMP క్లినిక్ వద్ద తల్లిదండ్రులు,బంధువులు ఆందోళన...
View More
Breaking News
30 Jun 2025 23:11 PM
2
104
Newsread Image

No.1 Short News

Newsread
అజాన్ కోసం యాప్.. లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు నేపథ్యంలో..
లౌడ్ స్పీకర్ల సౌండ్ పై మహారాష్ట్రలో ఆంక్షలున్న నేపథ్యంలో మసీదులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యాయి. అజాన్ (ప్రార్థన కోసం పిలుపు) ను నేరుగా సంబంధికులకు చేరేలా ప్రత్యేకంగా ఆన్ లైన్ అజాన్ అనే మొబైల్ యాప్ తో రిజిస్టరైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిని తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంస్థ అభివృద్ధి చేసింది. ప్రార్థనల పిలుపు కోసం వాడే లౌడ్ స్పీకర్ల వాడకంపై ఆంక్షలున్నాయి. ప్రార్థన పిలుపును నేరుగా సంబంధిత వ్యక్తులకే చేరడానికి ఉపయోగపుతుంది. లౌడ్ స్పీకర్లకు ఇది ప్రత్యామ్నాయం. ప్రార్థనలు చేసేవారు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తమకు దగ్గర్లో వున్న మసీదు నుంచి అజాన్ పిలుపు వినడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇంట్లోనే వుండి అజాన్ వినేలా ఈ ఉచిత యాప్ ను రూపొందించాం. అజాన్ సమయంలో మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా ఆడియోను వినవచ్చు అని మహిమ్ జుమా మజీద్ మేనేజింగ్ ట్రస్టీ ఫహాద్ ఖలీల్ పఠాన్ ప్రకటించారు. ముఖ్యంగా వృద్ధులు, ప్రార్థనలకు రాలేని వారు అజాన్ వినడానికి ఈ ఆన్ లైన్ అజాన్ యాప్ ను తెచ్చినట్లు తెలుస్తోంది. మసీదులో ఏర్పాటు చేసిన 10x15 బాక్స్ స్పీకర్లు సంప్రదాయకంగా వున్న లౌడ్ స్పీకర్ల మాదిరిగా గట్టిగా వినబడటం లేదని, లౌడ్ స్పీకర్లకే అలవాటుపడిన వారికి చాలా కష్టంగా వుందని ,అందుకే ఈ ఆన్ లైన్ యాప్ తెచ్చినట్లు మసీదు నిర్వాహకులు పేర్కొంటున్నారు. కేవలం మూడు రోజుల్లోనే మహిమ్ జుమా మసీదు సమీపంలోని 500 మంది ఈ యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని మహిమ్ జుమా మజీద్ ట్రస్టీ ఫహాద్ ఖలీల్ వెల్లడించారు. ప్రార్థనల కోసం ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని, వారి ప్రాంతాన్ని లొకేషన్ లో ఎంచుకొని, ఆ తర్వాత తమ సమీపంలోని మసీదును ఎంచుకుంటారని వివరించారు.
View More
Breaking News
30 Jun 2025 22:33 PM
2
91
Newsread Image

No.1 Short News

Newsread
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్
మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరింపు తమ టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స పొందుతుండగా ఫోన్ కాల్. జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు
View More
Breaking News
29 Jun 2025 14:37 PM
0
76
Newsread Image

No.1 Short News

Newsread
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి
బ్రేకింగ్ న్యూస్ మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి. ఆఫీస్ అద్దాలు ధ్వంసం ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీయార్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం కార్లు ధ్వంసం .. ఇంకా కొనసాగుతున్న దాడి స్టూడియోను ధ్వంసం చేసిన కార్యకర్తలు
View More
Breaking News
28 Jun 2025 15:28 PM
0
34
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ, ఆత్మహత్య
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్‌లో యాంకర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వేచ్ఛ పూర్ణ చందర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో తన నివాసంలో ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్వేచ్ఛ గతంలో తన తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి రామ్ నగర్‌లోని వైఎస్సార్ పార్క్ సమీపంలో నివసించగా, ఇటీవల జవహర్ నగర్‌లోని ఒక ఇంటికి మారినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఒక వ్యక్తితో మనస్పర్థల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్వేచ్ఛ గత 18 సంవత్సరాలుగా టీవీ9 సహా పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా పనిచేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఆమె ఈసీ మెంబర్‌గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
View More
Breaking News
28 Jun 2025 05:21 AM
1
58
Newsread Image

No.1 Short News

Newsread
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి తెలంగాణ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్‌(D) తిమ్మాపూర్‌(M) ఇందిరా నగర్‌కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్‌కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్‌లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్‌తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరూ మృతి చెందారు.
View More
Breaking News
26 Jun 2025 15:41 PM
0
10
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు అవినీతి పరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా?
బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు సూటి ప్రశ్న.... అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.... అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ ఉద్యోగులు నిర్దోషిగా నిరూపితమయ్యే వరకూ తిరిగి సర్వీసులోకి అనుమతించరాదని గురువారం ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొంది... ఇలాంటి వారిని మళ్లీ డ్యూటీలోకి చేర్చుకుంటే ప్రజల విశ్వాసం దెబ్బ తింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది... లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది..!
View More
Breaking News
26 Jun 2025 15:37 PM
4
10
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.
View More
Breaking News
17 May 2025 11:26 AM
1
2
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ ప్రజలకు విన్నపము
దొనకొండలో గాలి బాగా వీచుతున్నది కరెంటు తీగలు ఎక్కడైనా మంటలు వస్తున్న తీగలు మీద ఎక్కడైనా చెట్టు కొమ్మలు. పడిన స్తంభాల దగ్గర ఎక్కడైనా మంటలు వచ్చిన కరెంటు తీగలు ఎక్కడైనా తెగిపడిన చూసిన వాళ్లు వెంటనే దయచేసి కరెంట్ ఆఫీస్ కి గాని మీకు తెలిసిన కరెంటు అధికారులకు గానీ ఫోన్ చేసి తెలియజేయగలరు Current Dkd: +919490615448‬ ‪Ae Donakonda Curent: +919440812246‬ ‪Ramakrishna Linmen: ‪+917659941607‬
View More
Breaking News
08 May 2025 18:54 PM
2
4
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో భూకంపం, రెండు సెకన్ల పాటు కనిపించిన భూమి
ఏపీలో భూ ప్రకంపనలు.. ప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాలలో కంపించిన భూమి ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు
View More
Breaking News
06 May 2025 16:58 PM