

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ క్రిప్టో కరెన్సీ స్కామ్ లో టాలీవుడ్ హీరోయిన్స్
క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో టాలీవుడ్ హీరోయిన్స్
పుదుచ్చేరి ఫిబ్రవరి 28,2025: తమిళనాడు పుదుచ్చేరి లోని క్రిప్టోకరెన్సీ స్కామ్ లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 60 కోట్ల స్కామ్ జరిగినట్టు నిందితుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన వివాదంగా మారింది. క్రిప్టోకరెన్సీ ద్వారా అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనకు సంబంధించి, పుదుచ్చేరి సైబర్ క్రైం పోలీసుల విచారణలో తమన్నా, కాజల్ అగర్వాల్‌లను కూడా విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్లు నిందితులు వెల్లడించారు. ఇప్పటికే, పుదుచ్చేరి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఆశోకన్ ఫిర్యాదు మేరకు, నిందితులు నీతీష్ జైన్, అరవింద్ కూమార్ అరెస్టయ్యారు. వారు చెప్పిన ప్రకారం, 2022లో కోయంబత్తూరులో జరిగిన క్రిప్టోకరెన్సీ లాంచింగ్ ఈవెంట్‌లో తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో వీరు ప్రమోట్ చేసిన క్రిప్టోకరెన్సీ, స్కామ్‌లో భాగమై ఉండవచ్చుననే అనుమానాలు పెరిగాయి.
View More
Crime News
28 Feb 2025 10:31 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ అశ్లిల వీడియోస్ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ని బెదిరించి రూ, 2.53 కోట్లు కాజేసిన స్నేహితురాలి భర్త
అశ్లీల వీడియోల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన స్నేహితురాలి భర్త
నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కూకట్‌పల్లిలో హాస్టల్‌లో నివసిస్తుంది
అదే హాస్టల్‌లో చిన్ననాటి స్నేహితురాలు కాజా అనుషా దేవి పరిచయం అయింది. అనుషా దేవి భర్త నినావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ ను కూడా పరిచయం చేసింది
ఉద్యోగం లేక జల్సాలకు అలవాటు పడ్డ దేవనాయక్.. భార్య స్నేహితురాలైన బాధితురాలిని టార్గెట్ చేశాడు
ఫోనులో వేరే సిమ్ కార్డు వేసుకొని బాధితురాలికి ఫోన్ చేసి.. నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయి ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు
తానే బెదిరిస్తున్నాడని తెలియక బాధితురాలు ఈ విషయాన్ని దేవనాయక్ కు చెప్పింది. ఆ విషయం సెటిల్ చేస్తానని.. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని, అనేక సాకులు చెప్పి రూ.2,53,76,000 తీసుకున్నాడు
మోసపోయానని గ్రహించిన బాధితురాలు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది
నిందితుడు దేవానాయక్‌ను అరెస్టు చేసిన పోలీసులు రూ.1,81,45,000 స్వాధీనం చేసుకున్నారు
View More
Crime News
05 Feb 2025 12:07 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ రెండో పెళ్లి చేసుకున్న భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
మరో పెళ్లి చేసుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
పల్నాడు - రెండేళ్ల క్రితం ఆకుల వాసు, నవ్యశ్రీకి వివాహం చేసిన పెద్దలు
అయితే వీణా గాయత్రి అనే బంధువుల అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్న వాసు
కొంతకాలం నవ్యశ్రీకి కనిపించకుండా తప్పించుకుని తిరిగిన వాసు, గాయత్రి
సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో వాసు, గాయత్రి ఉన్నారని తెలుసుకుని బంధువులతో వెళ్లిన మొదటి భార్య నవ్యశ్రీ
నవ్యశ్రీ, ఆమె బంధువులపై ఆకుల వాసు దాడి - news credits by Telugu Scribe
View More
Crime News
04 Feb 2025 12:48 PM


No.1 Short News
Newsreadవృద్ద మహిళలకు మత్తుమందు ఇచ్చి వరుస దొంగతనాలు చేసున్న కిలాడీ లేడిని అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు
మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న మరియు ఆభరణాల షాప్ ల్లో బంగారం కొనడానికి అని వెళ్ళి దొంగతనాలు చేస్తున్న మహిళ ను అరెస్టు చేసి ఆమె వద్ద నుండి సుమారు Rs 35,00,000/- విలువ గల 460 గ్రాముల బంగారు ఆభరణాలు. మత్తు టాబ్లెట్లు స్వాదీనం చేసుకోవడం జరిగినది. ముద్దాయి గతంలో విజయవాడలో ఒక చోరీ కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్ళి వచ్చినట్టు, ఆమె టీవి లో వస్తున్న ఒక టీవీ సీరియల్ చూసి ఒంటరి వృద్ధ మహిళలని టార్గెట్ చేసి, వారికి మాయమాటలు చెప్పి, వారితో తెలిసినా మహిళగా మెలిగి, కూల్ డ్రింక్స్ లో కలిపి వారికి ఇచ్చి వారు నిద్రపోయ్యాక వారి వంటి మీద ఉన్న బంగారు వస్తువులు దొంగతనం చేసుకొని పోతుంది. ఈ కేసులో నిందితులను పట్టుకోనుటలో అత్యంత ప్రతిభ కనపరిచినఈ కేసులో నిందితులను పట్టుకోనుటలో అత్యంత ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు.
View More
Crime News
22 Jan 2025 19:50 PM
You are offline
Please check your internet connection.
Close