ఉల్లగల్లులో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 274 డ్వాక్రా మహిళా సంఘాలకు ₹27 కోట్లు రుణాన్ని ప్రభుత్వం తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళా శక్తికరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మహిళలు స్వయం సంస్కరణలో, చిన్న వ్యాపారాలు ప్రారంభించడంలో, కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం చేసుకోవడంలో ఈ రుణాలు కీలకంగా ఉపయోగపడతాయని కార్యక్రమంలో స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ధన్యవాదాలు తెలిపారు.
దర్శి, జనవరి 17: దర్శి నియోజకవర్గంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారు. ఉదయం 10.30కి దర్శిలో రూ.4 కోట్లతో కొత్త విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి భూమిపూజ, 11.15కి ఉల్లగల్లు లో రూ.3.90 కోట్లతో 33/11 కేవి సబ్‌స్టేషన్ శంఖుస్థాపన జరుగుతుంది. 11.45కి కీ.శే. నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ, 12 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటలకు పసుపుగళ్లలో బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. మీడియా సోదరులు కార్యక్రమాలను విస్తృతంగా కవర్ చేయాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు.
ఉల్లగల్లో మహిళా శక్తికి కొత్త అధ్యాయం – జన్ శిక్షణ సేవా సంస్థాన్ టైలరింగ్ కోర్స్ ముగింపు
ఉల్లగల్లు, ప్రకాశం జిల్లా:
జన్ శిక్షణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా నిర్వహించిన టైలరింగ్ కోర్సు ఈరోజుతో విజయవంతంగా పూర్తైంది. ఈ కోర్సులో పాల్గొన్న 20 మంది మహిళలు టైలరింగ్ నైపుణ్యాలను అభ్యసించి, స్వయం ఉపాధికి దారి తెరిచారు.
ట్రైనర్ ప్రసన్న మాట్లాడుతూ, “ఈ కోర్సు ద్వారా మహిళలు స్వంతంగా ఉపాధి పొందే సామర్థ్యం పెరిగింది. ఇంటి వద్దే టైలరింగ్ ప్రారంభించవచ్చు, చిన్న స్థాయిలో బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టొచ్చు” అని తెలిపారు.
కార్యక్రమ ముగింపు సందర్భంగా ట్రైనర్ ప్రసన్నకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక మహిళలు, సంస్థ ప్రతినిధులు సునీల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉల్లగల్లు కు తీసుకువచ్చేందుకు కృషి చేసిన భూలక్ష్మిని కూడా మహిళలు ప్రశంసిస్తూ సన్మానించారు.
ప్రకాశం జిల్లా – దర్శిలో కార్డన్ & సెర్చ్, 67 బైక్‌లు స్వాధీనం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణ శివారులోని శివరాజ్ నగర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నిరోధం కోసం పోలీసులు అకస్మికంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.
మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, దర్శి డిఎస్పి బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. సీఐలు, ఎస్సైలు సహా 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.
తరువాత “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ర్యాలీ నిర్వహించి, యువత, ప్రజలకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి–డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని 200 ఏళ్ల చరిత్ర గల నాగూర్ మీరావలి దర్గా వద్ద గంధ మహోత్సవం రేపు భక్తి పూర్వకంగా జరగనుంది. గత సంవత్సరం పునఃప్రారంభించిన ఈ వేడుక ఈ ఏడాది రెండవ గంధ మహోత్సవంగా జరుగుతోంది.
పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, ప్రముఖులు హాజరుకానున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేపు ఉదయం 10 గంటలకు 10,000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిస్తే పోలియోను పూర్తిగా నిర్మూలించవచ్చని ఐఆర్సీయస్ ఎగ్జిక్యూటివ్ మెంబరు కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. దరిశి గడియార స్తంభం సెంటర్‌లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో 11 నెలల చిన్నారికి పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.
ఒంగోలులో గంజాయి కట్టడి: రైలులో 7 కిలోల గంజాయి స్వాధీనం
ఒంగోలు: గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో అలప్పుజా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షూబ్లిని సత్కరించిన సయ్యద్ మెహతాజ్ బేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జనాబ్ ఫారూక్ షూబ్లి గారిని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉర్దూ భాషాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఉర్దూ భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణలో ఆయన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ – డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి నియోజకవర్గంలో 135 మంది లబ్ధిదారులకు రూ.82,36,297 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ శనివారం తన నివాసం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యతో పాటు పార్టీ నేతలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
అంగన్వాడీలకు 5G ఫోన్లు – మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ కీలక అడుగు వేసింది. దర్శి నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 15 మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం 344 మందికి 5G ఫోన్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి శిశువుకు చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు, మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఒక డాక్టర్‌గా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు దర్శి సర్కిల్ ఆఫీస్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దర్శి సిఐ వై. రామారావు ఆధ్వర్యంలో ముండ్లమూరు ఎస్సై కె. కమలాకర్, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు నెలల బైండోవర్‌లో ఉన్నప్పటికీ ఎవరైనా నేరాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
చాకచక్యంగా దొంగతనం కేసు ఛేదన – నిందితుల అరెస్ట్, భారీ రికవరీ
ఒంగోలు పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన దొంగతనం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా స్వల్ప వ్యవధిలో ఛేదించారు. ఈ కేసులో సుమారు రూ.20.20 లక్షల విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
2025 నవంబర్ 27న పెళ్లి వేడుకల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 158 గ్రాముల బంగారు నగలు, నగదుతో ఉన్న బ్యాగ్‌ను దొంగిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, తాలూకా సీఐ టి. విజయ కృష్ణ నేతృత్వంలో పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌ఘర్ జిల్లా సాన్సి నివాసి గ్రామానికి వెళ్లి ఇద్దరు నిందితులు మరియు ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నగలు, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
నితీష్ కుమార్ చర్యలకు నిరసనగా ఒంగోలులో ఎస్‌డీపీఐ ఆందోళన
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివాదాస్పద చర్యలకు వ్యతిరేకంగా సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఆధ్వర్యంలో ఒంగోలు గుంటూరు రోడ్డులోని పోతురాజు కాలువ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, ఆయుష్ విద్యార్థికి పత్రాలు అందజేస్తూ మహిళా డాక్టర్ మాస్క్‌ను లాగడం అనుచితమని విమర్శించారు. ప్రజాప్రతినిధుల విలువలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, నితీష్ కుమార్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజావలి, ఖాసిం, లతీఫ్, నసీమ, షాహీన తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు భద్రం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో నిర్వహించిన పవర్ సేవింగ్ అవగాహన ర్యాలీలో టిడిపి దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని, అవసరానికి మించి విద్యుత్ వినియోగం భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని హెచ్చరించారు. సహజ వనరులు, ఇంధనం, విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైందని తెలిపారు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుతూ సోలార్ విద్యుత్ వైపు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో వైసీపీ భారీ ర్యాలీ
వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, సేకరించిన సంతకాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు.
కోటి సంతకాల పత్రాల తరలింపులో భాగంగా ఒంగోలులో వైసీసీపీ ర్యాలీ
కోటి సంతకాల సేకరణ పత్రాలను తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మణంద రెడ్డి , మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు , కె. నాగార్జున రెడ్డి ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి , కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
డా. గొట్టిపాటి లక్ష్మీని కలిసిన గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి
నరసరావుపేట: నేడు నరసరావుపేటలోని డా. గొట్టిపాటి లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని ప్రకాశం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుచిత్ర ని శాలువాతో సత్కరించి, గ్రంథాలయం చైర్మన్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
5 తరాలకు సలహాలు ఇస్తున్న శతాధిక వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ
దొనకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గొంగటి వెంకట సుబ్బమ్మను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కొంతసేపు ముచ్చటించి, వారి దీర్ఘాయుష్షుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, సహజ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమే తన ఆరోగ్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కూడా తనపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. పట్టణ జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యకర ఆహార అలవాట్ల వల్ల యువత చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
40 మంది రక్తసంబంధీకులతో, ఐదు తరాల మనవళ్లు–మునిమనవరాళ్లతో కలిసి జీవించడం దేవుడిచ్చిన వరమని, ఈ వయసులోనూ సరదాగా, సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వెంకట సుబ్బమ్మ జీవన విధానం నేటి తరాలకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. పల్లె జీవన విలువలు, ఆరోగ్యకరమైన అలవాట్లపై యువత దృష్టి పెట్టాలని సూచించారు.
దర్శి టౌన్‌లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సిఐ వై. రామారావు, ఎస్ఐ మురళి మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదిలి రోడ్డులోని షాపుల వద్ద, వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అనే సందేశం ఇచ్చారు.
షాపుల్లో హెల్మెట్ అవగాహన స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని వ్యాపారులకు సూచించారు.
హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న కొంతమందిని గుర్తించి వారికి సిఐ రామారావు స్వయంగా అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, మంచు కాలంలో ప్రమాదాలు ఎక్కువ. అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, రోడ్డు భద్రత పాటించాలి అన్నారు.
ప్రజల కోసం పోరాడే నాయకత్వం. డా||లక్ష్మీ పట్టుదలకి ప్రభుత్వ స్పందన
దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి అనేది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లక్ష్యం. ప్రజల సమస్యలను తమ సమస్యగా తీసుకుని పని చేసే అసలైన నాయకత్వం మళ్లీ నిరూపించారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యలకు చివరకు శాశ్వత పరిష్కారం వచ్చింది. గ్రామాల మధ్య రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన డాక్టర్ లక్ష్మీ —ఈ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు.
పల్లె పండుగ 2.0 లో భాగంగా ప్రభుత్వం వెంటనే స్పందించి 10.17 కోట్ల రూపాయలతో 20.92 KM రోడ్లు దర్శికి మంజూరు చేసింది.
ఆమోదం పొందిన ప్రధాన రహదారులు: 1️⃣ మారెళ్ల – నూజళ్లపల్లి – బట్లపల్లి : ₹4.14 కోట్లు
2️⃣ పెద్ద ఉల్లగల్లు – సింగన్నపాలెం : ₹4.05 కోట్లు
3️⃣ దొనకొండ – గజ్జలకొండ వయా ఇండ్లచెరువు : ₹1.98 కోట్లు
ఈ రోడ్లు పూర్తయితే దర్శి ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, రైతులు–విద్యార్థులు–రోగులు ఇక మట్టిబాటల ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు. దర్శి అభివృద్ధిలో ఇది ఒక పెద్ద ముందడుగు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై అరెస్ట్‌లను ఖండించిన గులాం రసూల్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన రాష్ట్ర విద్యాధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి-పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
కర్నూలు: కర్నూలుకు చెందిన మహమూద్ పీర్ ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ క్యాంపు కార్యాలయం కి విచ్చేసి, ఫరూక్ షుబ్లీ కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రెండు వ్యక్తులు విభిన్న విషయాలను చర్చించగా, ఫరూక్ షుబ్లీ ఈ వినతి పత్రం విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారనే తెలిపారు.
వారసత్వ మసీదులను కాపాడడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్‌డిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 6ను దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో గోరంట్ల సర్కిల్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 6 భారత చరిత్రలో రెండు విషాద సంఘటనల రోజు అని చెప్పారు.
అదే రోజు భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాపరివాణం
బాబ్రీ మసీదు ధ్వంసం… భారత వారసత్వానికి మిగిల్చిన నెగెటివ్ ముద్ర
భారతీయులమనుకుంటూ మైనార్టీలపై గుంపు దాడులు, ప్రార్ధనా స్థలాలపై దాడులు, మహిళలను అవమానించటం… ఇలా ప్రజాస్వామ్యాన్ని ఛేదించే చర్యలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు.
ప్రజలు ఆకలి, నిరుద్యోగంతో ఆందోళన చెందుతుంటే… కోట్ల రూపాయలు విగ్రహాలు, ఆలయాలకు ఖర్చు చేస్తూ మత పేరుతో మూఢనమ్మకాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
వక్ఫ్ సవరణలపైనా ఆయన మండిపడ్డారు.
సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా ఉమ్మీద్ యాప్‌కు గడువు పెట్టడం అన్యాయమని… ముస్లింలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. వక్ఫ్ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
అబ్దుల్ సత్తార్ చేసిన ప్రధాన డిమాండ్లు:
ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగితే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి. ముస్లింల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. వక్ఫ్ ఉమ్మీద్ యాప్ గడువు పొడగించాలి.
ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా కార్మిక నాయకులు పఠాన్ సాజిద్ ఖాన్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఖాజా వలి, బ్రాంచ్ అధ్యక్షులు షఫీగని, అబ్దుల్ రజాక్, ఖాదర్ భాషా, మహమ్మద్ సాధ్ తదితరులు పాల్గొన్నారు.
దర్శి నియోజకవర్గంలోని దొనకొండను కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలో కలపాలని డిబిహెచ్‌పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఏ పనికైనా ఒంగోలుకు 90 కిమీ ప్రయాణం చేయాల్సి వస్తోందని, మార్కాపురం 30 కిమీ దూరంలో ఉండడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. బస్సు సౌకర్యం లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
దొనకొండ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నిరసనలకు దిగుతామని సుజాత హెచ్చరించారు.
అద్దంకి మండలంలోని మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 162 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల కోసం సైకిళ్ల అందజేయడంలో సహకరించిన NREDCAP మరియు ASSIST సంస్థలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దూరప్రాంతాల్లోని విద్యార్థులు ప్రయాణ సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో, ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో 5,300 మందికి పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేశాము.
తేజస్వి పొడపాటి ఆహ్వానంతో ద్వి కుటుంబ తేనిటీ విందు
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి ప్రత్యేక ఆహ్వానంతో, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు లలిత్ సాగర్ దంపతులు సోమవారం సాయంత్రం ఒంగోలు నివాసంలో తేనిటీ విందులో పాల్గొన్నారు. రెండు కుటుంబాలు స్నేహపూర్వక వాతావరణంలో ఆనందంగా గడిపారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో, త్రిపురాంతకం సీఐ అస్సన్ పర్యవేక్షణలో కురిచేడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ జరిగింది.
స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, ఆయుధాల నిర్వహణ, శుభ్రత, స్టాఫ్ పనితీరును పరిశీలించిన అధికారులు — పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని, ప్రజలతో మరింత సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.
స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి సిబ్బంది కృషి చేయాలని ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉర్దూ భాషాభివృద్ధికి సహకారం అందించాలని కోరగా, భాషకు మతాలతో సంబంధం లేదు… ఉర్దూ అభివృద్ధికి తప్పకుండా తోడ్పాటునిస్తాం అని మాధవ్ హామీ ఇచ్చారు.
దర్శి అభివృద్ధి కి డా|| లక్ష్మీ నిబద్దత,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి వినతి
గత 18 నెలలుగా దర్శి అభివృద్ధి కోసం నిరంతరం పరిగెడుతున్న దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, నియోజకవర్గ ప్రజల ప్రధాన డిమాండ్ అయిన సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం కోసం సుమారు ₹2 కోట్లు నిధులు మంజూరు చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ప్రకాశం జిల్లాలో దర్శి కొనసాగింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శి లో రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, సిబ్బంది కొరత వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు.
అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని గ్రామాగ్రామం పర్యటిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడుతూ, యువత కోసం ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే దిశగా కృషి చేస్తూనే ఉన్నట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీకి కొత్త జీవం పోసే నాయకునిగా ఎదుగుతున్న చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
నా మీద ఉంచిన నమ్మకాన్ని… పనితో నిరూపిస్తాను!— చైర్మన్ శపథం!
ఉర్దూ అకాడమీ అభివృద్ధి, కొత్త కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ముందుంచిన ప్రతిపాదనలకు సీఎం సానుకూల స్పందన. యువశక్తికి ప్రేరణగా నిలుస్తూ…
ఉర్దూ భాష కోసం కొత్త దిశలో అడుగులు — త్వరలోనే అమలులు!
అమరావతి రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాక్!
2.5 లక్షల LOC చెక్కును అందచేసి డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణం గాంధీనగర్ నివాసి బట్టువరపు అడుగుల శ్రీనివాసులకు అనారోగ్య కారణంగా సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2,50,000/- LOC చెక్కును దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు చిన్నా తదితరులు పాల్గొన్నారు.
మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివశ్రీనివాసరావు.. ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణ రాజు.. ఏపీ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఛైర్మన్‌గా విక్రమ్..ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మౌలానా షిబిలీ..ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా రామ్ ప్రసాద్.. పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మధుబాబు.. స్టేట్ రెడ్డిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా శంకర్‌రెడ్డి.. కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మిన్నప్ప..షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా ముక్తియార్.. భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వెంకటేశ్వరరాజు పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా వీరభద్రరావు..
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. పదవ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు శుక్రవారం రోజున విడుదల చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది, మార్చి 18న సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు, మార్చి 20న ఆంగ్లం, 23న గణితం, మార్చి 25న భౌతిక శాస్త్రం (ఫిజికల్ సైన్స్), మార్చి28న జీవశాస్త్రం ( బయలాజికల్ సైన్స్), మార్చి 30న సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు మార్చి 31న కాంపోజిట్ కోర్సులకు ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2) పరీక్ష ఉంటుంది. అలాగే ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీన థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక వంద మార్కులకు నిర్వహించే పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. 50 మార్కులకు నిర్వహించే పరీక్షలు (సైన్స్, సోషల్) ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి11 గంటల 30 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
AP: ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కాగా, 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు: గొట్టిపాటి లక్ష్మి
దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ—ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తున్న తీరు అందరికీ ఆదర్శమని అన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా అధికారులు అప్రమత్తంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిరగనీయవద్దని, ముఖ్యంగా రెవిన్యూ, భూముల ఆన్లైన్ ఎంట్రీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, భూ వివాదాలు వంటి అంశాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేకాక విద్యుత్, పెన్షన్లు, రోడ్లు, డ్రైన్లు, పోలీస్ కేసులు వంటి సమస్యలకు కూడా త్వరితగతిన స్పందించాలని అన్నారు. వచ్చే ప్రజా వేదిక నాటికి అందిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా సాధ్యం కాని సమస్యలు తన ద్వారా జిల్లా కలెక్టర్‌కు చేరవేస్తానని హామీ ఇచ్చారు.
దొనకొండలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సోలార్ పార్క్, ఆయుధ తయారీ కేంద్రం వంటి పరిశ్రమలతో ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, టిడిపి సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్–యూనిట్–బూత్ ఇంచార్జిలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
ఈరోజు ప్రతి రైతు ఇంట్లో పండుగ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కురిచేడు మండలం, పొట్లపాడు గ్రామంలో బుధవారం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. వారితో పాటూ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, అగ్రికల్చర్ రెవిన్యూ, ఎంపీడీఓ అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మాట నిలుపుకొని రైతును నిలబెట్టే ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండవ విడత క్రమం తప్పకుండా రైతులు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5,000, పీఎం కిసాన్ కింద గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇచ్చే రూ. 2,000 కలిపి 7,000 రూపాయలు అర్హులైన ప్రతి రైతుకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ వ్యవసాయ శాఖ మాత్యులు కే అచ్చం నాయుడు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో నేడు ఈ పథకాన్ని రైతులకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. ఆనాడు తొలివిడత నిధులు మన దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఆనాడు కొందరు వైసీపీ నేతలు హేళన చేశారు ఇప్పుడు ఏం మాట్లాడతారు మాట నిలుపుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది.
ప్రజల సంక్షేమం అభివృద్ధి ద్వేయంగా మన ప్రభుత్వం 18 నెలల కూటమి పాలన సాగుతుందన్నారు. ఇటీవల కురిచిన తుఫాను తాకిడి పంట నష్టాలు అంచనా వేయడం జరిగిందని రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అన్నారు.
దర్శి లో రెండేళ్ల బిడ్డతో ఒక మహిళ కురిచేడు రోడ్డులోని సాగర్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.అయితే అటుగా వెళ్తున్న ఎస్సై మురళి గమనించి స్థానికుల సహాయంతో సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న తల్లి బిడ్డను బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బిడ్డ పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సకాలం లో స్పందించి ఎసై తల్లిబిడ్డను కాపాడారు. ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన మహిళను పోలీసులు విచారిస్తున్నారు..
ఒక అబద్ధాన్ని నలుగురూ కలిసి ఎంత బలంగా ప్రచారం చేస్తే అది అంత నిజంగా మారిపోతుందన్నది వాట్సాప్ యూనివర్సిటీ సభ్యులు నమ్మే బలమైన ఫిలాసఫీ! వాట్సాప్ యూనివర్సిటీ నడిపే ఫేక్ ప్రోపగాండాకు చదువుసంధ్యలు లేని కొందరు వ్యక్తులు ప్రభావితమవుతుంటారనుకుంటే పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ సమాజంలో కొందరు ఉన్నత విద్యావంతులు, మీడియా రంగంలో సైతం పనిచేసే వ్యక్తులు, చివరకు కొందరు నాస్తికులు సైతం ఈ ఫేక్ ప్రోపగాండాకు ప్రభావితమైపోయి కొన్నిసార్లు... ఉగ్రవాదులంతా ముస్లిములే అని చిల్లర వాట్సాప్ స్టేట్మెంట్లు ఇస్తూ తమ మనసుల్లో ఏ మూలనో దాగున్న మత విద్వేషాన్ని వెళ్లగక్కుతూ సంతృప్తి పడుతుంటారు.
చివరకు ఈ మధ్య నా అన్వేషణ పేరుతో ఛానల్ నడిపే యూట్యూబర్ సైతం ముస్లిములందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అని చిల్లర వాట్సాప్ స్టేట్మెంట్ ఇచ్చే స్థితికి దిగజారిపోయాడంటే వాట్సాప్ ఫేక్ ప్రోపగాండా సొసైటీలో ఎంత బలంగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
వాట్సాప్ ఫేక్ ప్రోపగాండాకు ఇతని మానసిక పరిస్థితి ఎంతగా ప్రభావితమైం దంటే... ముస్లిములను ఉగ్రవాదం చెయ్యటానికి ఖురాన్ గ్రంథమే ప్రభావితం చేస్తుందని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇది కేవలం ఇతనొక్కడి మానసిక పరిస్థితి మాత్రమే కాదు, ముస్లిం వ్యతిరేకత మెదళ్లలో నింపుకున్న చాలామంది మానసిక పరిస్థితి నేడు ఎలా ఉందంటే... మొత్తం చెడ్డోళ్లంతా పనికట్టుకుని ముస్లిం సమాజంలో మాత్రమే పుట్టారు, అమాయకులు మంచోళ్లంతా హిందూ సమాజంలో పుట్టారని ఊహించుకునేంత స్థితిలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు!
ఏ మతానికి చెందిన వాడైనా ఉగ్రవాదానికి పాల్పడితే కచ్చితంగా అందరూ కలిసి అతన్నో నేరస్తుడుగా పరిగణించి ఖండించాల్సిందే కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అని స్టేట్మెంట్ ఇవ్వటానికి మించిన అజ్ఞానం, మూర్ఖత్వం మరొకటి ఉండదు.
సరే ఉగ్రవాదులంతా ముస్లిములే అన్న బోగస్ థియరీని బలంగా నమ్మే వారు... ఎప్పటివో సంఘటనలు కాదు, ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులకు దేశ రహస్యాలు చేరవేస్తూ, ఉగ్రవాదం చేస్తూ పట్టుబడ్డ కొన్ని సంఘటనలకు చెందిన న్యూస్ ఆర్టికల్స్ చదవాలి. నిజంగా ఉగ్రవాదాన్ని ఖురాన్ గ్రంథమే ప్రేరేపిస్తుంది అనుకుంటే మరి వీళ్ల ఉగ్రవాదం వెనుక ఏ గ్రంథం పని చేస్తుందో చెప్పాల్సి ఉంటుంది.
నేనైతే ఎప్పుడూ చెప్పేమాట ఒక్కటే... ఉగ్రవాదానికి మతం ఉండదు, మతాన్ని అనుసరించేవాడు ఉగ్రవాదానికి పాల్పడడు. మరి ఉగ్రవాదానికి ఎవడు పాల్పడతారు? అంటే... మత ఉన్మాదాన్ని మతి నిండా నింపుకునే పిచ్చోళ్లే ఉగ్రవాదానికి పాల్పడతారు... ఆ ఉన్మాదులకు హిందూ పేర్లైనా ఉండొచ్చు లేదా ముస్లిం పేర్లైనా ఉండొచ్చు... లేదా వేరే ఏ మతానికి చెందిన పేర్లైనా ఉండొచ్చు...
వైయస్ఆర్సీపీ దర్శి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ నాగూర్
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి దర్శి నియోజకవర్గ మైనారిటీ సెల్ అనుబంధ విభాగానికి అధ్యక్షులుగా షేక్ నాగూర్ ను నియమిస్తున్నట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది, తనపై నమ్మకంతో తనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అలాగే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారికి షేక్ నాగూర్ కృతజ్ఞతలు తెలిపారు.
హల్దీ వేడుకలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం నాగంబోట్లపాలెం గ్రామంలో షేక్ రఫీ కుమారుడు కలాం పెళ్లికుమారుని చేయు కార్యక్రమం (హల్దీ)లో దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుడు కలాం ను ఆశీర్వదించారు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ బీహార్లో ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శి పట్టణం స్థానిక బిజెపి నాయకులు బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీహార్లో సునామి సృష్టించారని రాబోవు స్థానిక ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో గాని భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు తిండి నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కాకర్లనాగసాయి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అచ్యుత గురువర్ధన్ రావు, పట్టణ అధ్యక్షులు వల్లభ వరపు అమరేశ్వర రావు అచ్యుత్ శరత్ బచ్చు అనిల్ యువమోర్చా నాయకులు అనిల్, జనసేన నాయకులు పాపారావు, శివ కోటా చారి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలైంది. నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాల్సి ఉందని ఇటీవల SEC తెలిపారు. నవంబర్ 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సన్నాహాలు పూర్తి చేసి, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని SEC యోచన చేస్తోంది. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించేందుకు SEC ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం.
చిల్డ్రన్స్ డే వేడుకల్లో విద్యార్థులతో దర్శి సీఐ, ఎస్సై.
చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా, ప్రకాశం దర్శి పోలీసులు దర్శి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించారు. వారితో బాలల దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్లు, రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు మరియు స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి సీఐ శ్రీ వై. రామారావు, ఎస్సై శ్రీ ఎం. మురళి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మసలుకుని, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మార్గదర్శకత్వం అందించారు. సుమారు 60 మంది విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, స్వీట్లు పంచి వారికి ఆనందాన్ని పంచారు.
పేదల గృహప్రవేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత, ఆమె భర్త ఈశ్వర్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహప్రవేశం అనంతరం నమాజ్‌లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 నెలల ఇమామ్ & మౌజ్జన్ గౌరవ వేతనాల కొరకు 90 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది
దర్శి లో మెడికల్ కాలేజీ ల ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా వైకాపా ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా దర్శి లో స్థానిక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి రోడ్డులోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పక్కా గృహాల భూమి పూజ కార్యక్రమంలో డా||గొట్టిపాటి లక్ష్మి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ – ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 క్రింద 54 మంది లబ్ధిదారులకు పక్కా గృహమూల మంజూరు ఉత్తర్వుల పంపిణీ & భూమి పూజ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా|| లక్ష్మీ మాట్లాడుతూ
ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్ళ వలె కలిసి నడుస్తున్నాయని, వైసిపి అవినీతి పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నేషనల్ మైనార్టీస్ డే సందర్భంగా ఒంగోలు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా BJMC
రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ,
BJMC ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, షేక్ సిద్ధాంబీ , BJMC ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజీద్ ఖాన్,
BJMC రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పుగుండూరి వెంకటేశ్వరరావు, కరాటే కోచ్ షేక్ కరీముల్లా మరియు ముస్లిం సోదరులు తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యారంగ అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు.
దేశ స్వతంత్రం కోసం ఆనాడు త్యాగాలు చేసిన వ్యక్తులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక వ్యక్తి అని, ఆయన జీవితాంతం దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. కార్మికులతో పాటు ప్రజలందరూ ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లి పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరు jkc కాలేజీ ఆడిటోరియంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు అభినందన కార్యక్రమంలో అతిధిగా గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ RRR తో కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు.