Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జిదారులను కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రత్యేక సిబ్బందిని కలెక్టర్ నియమించారు
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
5
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
మేదరమెట్లకు బయలదేరిన వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయలుదేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహానికి జగన్ నివాళులు అర్పించనున్నారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
5
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM
0
5
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
22న పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన?
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM
0
6
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM
0
6
Newsread Image

No.1 Short News

Newsread
పడమర లక్ష్మీపురంలో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దొనకొండ మండలం, పడమర లక్ష్మీపురం గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం మరియు పడమర లక్ష్మీపురంలో గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
17 Mar 2025 19:22 PM
2
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
జరుగుమల్లి: నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని రామచంద్రపురంలో సోమవారం ప్రమాదవశాత్తు పక్క పక్కనే ఉన్న 4 పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకటరావు, ఆదిలక్ష్మి, ఆదేమ్మ, మాలకొండయ్య, శ్రీనివాసరావు, మురళి, రామారావు, వెంకటేశకు చెందిన బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
View More
Local Updates
17 Mar 2025 17:48 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
మార్కాపురం: ఆస్తి తీసుకొని గెంటేశాడయ్యా!
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపల మడుగు కొత్తపల్లికి చెందిన వృద్ధుడు కోటయ్య కన్న కొడుకు గెంటేశాడని మార్కాపురం సబ్ కలెక్టర్ను ఆశ్రయించాడు. తన కొడుకు ఆస్తి మొత్తాన్ని తీసుకొని, అన్నం పెట్టకుండా గెంటేశాడని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్కు ఫిర్యాదు చేశాడు. గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని కోటయ్య వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ ఆఫీస్కు వచ్చాడు.
View More
Local Updates
17 Mar 2025 14:58 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
కంభం: పాత్రికేయులను దూషించిన మహిళపై కేసు.!
కంభం పట్టణంలో పాత్రికేయులను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో వారి ఫోటోలతో సహా పెట్టి దూషిస్తున్న మహిళ, ఆమె భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగతంగా దూషించటం నేరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు.
View More
Local Updates
16 Mar 2025 22:34 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
ప్రకాశం: హాల్ టికెట్ ఫ్రీ జర్నీ
ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అల్ట్రా, పల్లె వెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అధికారి వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌలభ్యం ఆర్టీసీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
View More
Local Updates
16 Mar 2025 22:32 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: దేవతి వారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని దేవతి మహానంద సోదరులు దేవతి వరప్రసాదరావు - శ్రీమతి వసుంధర గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
View More
Local Updates
15 Mar 2025 14:43 PM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజా చైతన్యంతో నే పరిశుభ్రత సాధ్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా భాగస్వామ్యంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడవద్దు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగ్ లు వాడాలి అంటూ అవగాహన అవగాహన ర్యాలీలో కల్పించారు. పట్టణం లోని దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దంటూ దుకాణదారులకు అవగాహన కల్పించా రు. డా|| గొట్టిపాటి లక్ష్మీ పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల MRO శ్రవణ్ కుమార్, దర్శి మునిసిపల్ కమిషన్ మహేష్, అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. పట్టణంలోని పౌరులందరూ రాజకీయాలకతీతంగా, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువత మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు
View More
Local Updates
15 Mar 2025 13:02 PM
0
19
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: ప్లాస్టిక్ వాడకం ఆపాలి: మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఒకసారి వాడి పడేసే ఈ ప్లాస్టిక్ వాడరాదని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వలన అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై అవగాహన చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వెస్తుందని తెలియజేశారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
View More
Local Updates
15 Mar 2025 12:47 PM
1
19

No.1 Short News

Newsread
దర్శి: ఇంటింటికి రెవిన్యూ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
శనివారం దర్శి పట్టణంలో 1వ వార్డ్ లో ఇంటింటికి దర్శి రెవెన్యూ కార్యక్రమం లో బాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు డా|| గొట్టిపాటి లక్ష్మీ సూచనలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు దర్శి మండల MRO శ్రవణ్ కుమార్ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు రెవెన్యూ సిబ్బంది, మున్సిల్ సిబ్బంది ఉన్నారు.
View More
Local Updates
15 Mar 2025 11:26 AM
4
101
Newsread Image

No.1 Short News

జాషువా - కొండేపి రిపోర్టర్
నేతివారిపాలెంలో ఘనంగా దామచర్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొండేపీ మండలం నేతివారిపాలెం గ్రామ తెదేపా నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరిపారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు.
View More
Local Updates
05 Mar 2025 10:04 AM
0
28
Newsread Image

No.1 Short News

Newsread
లీడర్: ఇది కదా అసలైన నాయకత్వం, నేనున్నా అనే భరోసా..
ఇప్పటిదాకా నాయకులని చూశాం, వారి పరిధులను చూశాం, కానీ ప్రజల తో మమేకమై, దర్పం ప్రదర్శించకుండా, అతి సాధారణ నైజాన్ని కూడా చూపించే అసలు సిసలు బాధ్యతాయుత నాయకురాలు దర్శి నియోజకర్గ టీడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అనడానికి ఈ చిత్రం ఉదాహరణ గా చెప్పవచ్చు.తన హోదా, పదవి, స్థాయిని పక్కనబెట్టి సాటి మహిళ బాధను పంచుకుంటున్న ఈ చిత్రం దర్శి ప్రజల హృదయాలను ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు.
View More
Local Updates
04 Mar 2025 22:37 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: కబడ్డీ పోటీల్లో రెండవ స్థానం లో శ్రీ గౌతమి విద్యార్థులు
మార్కాపూర్ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ కబడ్డీ క్లబ్ వారు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మార్కాపురం శ్రీ గౌతమీ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచి విజయ్ దుందుభి మోగించారు వారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగినది
View More
Local Updates
04 Mar 2025 15:59 PM
0
22
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం లోని శ్రీ గౌతమి హై స్కూల్ లో ఐఐటి పరీక్షలు
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని శ్రీ గౌతమి హై స్కూల్ నందు విద్యార్థులకు ఐఐటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎప్పటికప్పుడు మెరుగైన జ్ఞానాన్ని అందించడంలో శ్రీ గౌతమి విద్యాసంస్థలు ఎప్పుడు ముందు ఉంటాయని శ్రీ గౌతమి హై స్కూల్ ప్రిన్సిపల్ భూషణం ఒక ప్రకటనలో తెలిపారు.
View More
Local Updates
04 Mar 2025 14:52 PM
3
29
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
వివాహ రిసెప్సన్ శుభకార్యక్రమం లో పాల్గొన్న టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్
ఈరోజు దర్శి పట్టణం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో వడ్డమాని శ్రీనివాస శాస్త్రీ - శ్రీమతి వెంకట నాగ భారతి కుమారుని వివాహ రిసెప్సన్ కార్యక్రమం లోని వధువారులు చి|| సత్య భరద్వాజ శర్మ, చి||ల||సౌ|| లలిత ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్ వారితో పాటు టిడిపి సీనియర్ నాయకులు కలువకొలను చంద్ర శేఖర్ , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , దారం సుబ్బారావు ,సుంకర రాఘవరెడ్డి రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.
View More
Local Updates
04 Mar 2025 08:24 AM
0
34
Newsread Image

No.1 Short News

T Mahesh
గోరంట్ల గుంతల మయంగా వానవోలు రహదారి
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీలో గుంతలమయంగా వానవోలు రహదారి గోరంట్ల మండలంలోని గోరంట్ల నుంచి ఉగ్గురాంపల్లి వానవోలు రోడ్డు గుంతలు ఏర్పడి చాలా అధ్వానంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. ఈ రోడ్డుపై ఆటోలు రాక తాటిమాకులపల్లె, బాచన్నపల్లి ఉగ్గురాంపల్లి, పెట్లకుంటపల్లి, ఎముకల గుట్లపల్లి ప్రజలు గోరంట్ల వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
View More
Local Updates
04 Mar 2025 08:23 AM
7
28
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
వివాహ వేడుకకు హాజరైన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం దర్శి పట్టణం నందు వాసవి కళ్యాణ మండపం లో లాయర్ శ్రీనివాస శాస్త్రి కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలుగురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Local Updates
03 Mar 2025 15:06 PM
1
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
పార్టీ నాయకులకు కార్యకర్తలకు పరామర్శించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం దారం వారి పాలెం గ్రామంలో పార్టీ నాయకులను కార్యకర్తలను పరామర్శించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి .
View More
Local Updates
03 Mar 2025 14:58 PM
0
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
భారతదేశ మొదటి ముస్లిం మహిళా మంత్రి మాసుమా బేగం వర్ధంతి వేడుకలు
ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా తాళ్ళూరు మండలం తూర్పు గంగవరంలో దరిశి రోడ్డునందుగల స్థానిక మజీద్ కు సమీపంలో వున్న HP పెట్రోల్ బంకు ఆవరణలో, ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం ఆరంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(సమైక్యాంధ్రప్రదేశ్) మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసి,భారత దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రిగా పనిచేసి, భారత దేశ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిన మసూమా భేగం వర్ధంతి సందర్భంగా, IRCS(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈమె చిత్రపటానికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించారు.ఈమె తొలి మహిళా సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలవారికి ఎనలేని సేవలందించారని ఈమె చేసిన సేవలను కొనియాడారు.ఈ మె 1952లో,1957లో రెండుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికై, ఒకసారి శాసనసభ ఫ్లోర్ లీడరుగాను,ఇంకోసారి మంత్రిగానూ సేవలందించారని తెలిపారు.ఈమె ప్రముఖ సంఘసేవకురాలు సరోజినీనాయుడు శిష్యురాలిగా వుండి మంచి సంఘసేవకురాలిగా పేరుప్రఖ్యాతులు గఢించారని కపురం శ్రీనివాసరెడ్డి ఈమె సేవాతత్పరతను గురించి సవివరంగా వివరించారు. ఈ కార్య క్రమానికి ముస్లిం సంధానీ,మీరావలి, సైదా, వలి,అశోక్ బాబు,చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
03 Mar 2025 10:19 AM
6
43
Newsread Image

No.1 Short News

గంగాధర్,అదిలాబాద్ జిల్లా
ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో పవర్ శిక్షణ తరగతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసి ప్రయాణ ప్రాంగణంలో గత కొద్ది రోజుల నుండి పవర్ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి, శిక్షణలో భాగంగా ఆర్టీసిలోని అన్ని శ్రేణులకు చెందినటువంటి ఉద్యోగులను సైతం ఈ శిక్షణలో భాగస్వామ్యం చేసి ఆర్టీసీ అభివృద్ధికి అడుగులు వేస్తుందని ఆదిలాబాద్ ఆర్టీసి డిపో మేనేజర్ కల్పనా తెలిపారు, తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏం.డి వి. సి. సజ్జనర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రిజినల్ మేనేజర్ సొలొమాన్ ఈ సందర్బంగా తెలిపారు
View More
Local Updates
03 Mar 2025 09:54 AM
4
25
Newsread Image

No.1 Short News

Newsread
ముస్లిం సోదరీ, సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన బూచేపల్లి
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా అనుగ్రహంతో నెలరోజుల పాటు అత్యంత ఆంక్షలతో ఉపవాసం ఉండబోతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.
View More
Local Updates
01 Mar 2025 20:25 PM
2
27
Newsread Image

No.1 Short News

Newsread
రేపు దర్శి లో గొట్టిపాటి లక్ష్మీ పర్యటన వివరాలు
1. ఉదయం : 10.30 AM కి దర్శి లోని శివాలయం దేవస్థానం నందు రధ మహోత్సవం కార్యక్రమం లో పాల్గొంటారు. 2. 11.30 AM కి అద్దంకి రోడ్ లోని పోలేరమ్మవారి దేవస్థానం ఎదురుగా జనసేన నాయకులు షేక్ ఇర్షాద్ జ్ఞాపకార్ధం చలివేంద్రం ప్రారంభిత్సవం కార్యక్రమం లో పాల్గొంటారు. 3. తదుపరి దర్శి, LP రోడ్ లోని గొట్టిపాటి లక్ష్మీ మేడం గారి నివాసం వద్ద సాయంత్రం 5.00 PM వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు.
View More
Local Updates
27 Feb 2025 19:59 PM
2
18
Newsread Image

No.1 Short News

జాషువా - కొండేపి రిపోర్టర్
కొండపి: మీ వ్యాపార, రాజకీయ ప్రకటనలకు సరైన వేదిక న్యూస్ రీడ్ యాప్
మీ వ్యాపారం అభివృద్ధి కోసం, ఆన్లైన్ లో ప్రమోషన్స్ చేయడానికి మంచి సర్వీస్ కోసం ఎదురుచూస్తున్నరా.. ? అయితే మీకోసమే న్యూస్ రీడ్ లేటెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ అందుబాటులో ఉంది .ఈ యాప్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ప్రజాదరణ కలిగి ఉంది. మీ వాణిజ్య ప్రకటన లు న్యూస్ రీడ్ యాప్ లో చాలా తక్కువ ధరకే ఈజీగా మిరే పబ్లిసిటీ చేసుకునే అవకాశం న్యూస్ రీడ్ యాప్ అందిస్తుంది. ఈ యాప్ లో మీరు .. అతి తక్కువ ధరకే ప్రమోషన్స్ చేసుకోవచ్చు తాజా సమాచారం కోసం అయిన , వ్యాపార ప్రకటనల కోసం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజల సరైన ఎంపిన న్యూస్ రీడ్ లేటెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ , ఫోన్: న్యూస్ రీడ్ - 8247828640
View More
Local Updates
27 Feb 2025 13:00 PM
2
23
Newsread Image

No.1 Short News

జాషువా - కొండేపి రిపోర్టర్
Dola Swamy
పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Local Updates
27 Feb 2025 11:42 AM
0
18
Newsread Image

No.1 Short News

జాషువా - కొండేపి రిపోర్టర్
పోసాని కృష్ణమురళి అరెస్ట్
TG: వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు HYD రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
View More
Local Updates
27 Feb 2025 10:08 AM
1
26
Newsread image

No.1 Short News

DR Local News - Chirala
ఈపురుపాలెం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రభ వైభవం గా ఊరేగింపు జరిగినది
బాపట్ల జిల్లా, చీరాల మండలం, ఈపూరుపాలెం గ్రామంలో ఈ రోజు రాత్రి బాల కోటేశ్వర స్వామి వారి భక్త బృందం సీతారాంపేట, ఈపూరుపాలెం గ్రామం వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా అతి వైభవంగా *ప్రభ* ఊరేగింపు జరిగినది. ఈ ఊరేగింపులో మహిళామ తల్లుల హారతుల సేవ, కోలాట ప్రదర్శ న అత్యద్భుతముగా జరిగినది. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక్ బండారు జ్వాలా నరసింహo *సత్సంగం* చేయుచూ 400 సంవత్సరాల క్రితం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో మొట్టమొదటిసారిగా ప్రభల ఊరేగింపు జరిగినదని, అలాగే భారతదేశంలో సనాతన ధర్మం వర్ధిల్లుటకు ప్రధానంగా మహిళామ తల్లులే కారణమని కాబట్టి ఇటువంటి ఊరేగింపులు, హారతుల సేవలు, కోలాట ప్రదర్శనలు, భజనలు..... హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ సమాజ ఐక్యతకు ఏర్పాటు చేసినవని కావున కుల మతాలకతీతంగా సనాతన ధర్మ ఐక్యత కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని తద్వారా మన భరతభూమిని విశ్వ గురు స్థానంలో నిలపాల్సిన బాధ్యత మనందరిదని మాట్లాడుట జరిగినది. ఈ ఊరేగింపులో మహిళామ తల్లులు, బాలబాలికలు, గ్రామ ప్రజలు, కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు భవదీయ బండారు జ్వాలా నరసింహo జిల్లా సహ సంయోజక్ హిందూ చైతన్య వేదిక. చీరాల బాపట్ల జిల్లా
View More
Local Updates
27 Feb 2025 07:57 AM
0
24
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
చీరాలలో శ్రీ గోనందుల కళ్యాణం
చీరాలలో శ్రీ గోనందుల కళ్యాణం సాయంత్రం 5 గంటలకు 26-02-2025 బుధవారం మహాశివరాత్రి సందర్భముగా శ్రీ గోనందుల కళ్యాణం మరియు శ్రీ గోమయ గణపతి, గోమయ గౌరి సహిత శ్రీ నాగలింగ లఘు ప్రతిష్ఠ పూజ మరియు హోమ కార్యక్రమముల ఆహ్వానము హోమ కార్యక్రమం నిర్వహించువారు : గోఉవవాసుకులు శ్రీ సురభిదాసు బిరుదాంకితులు బ్రహ్మశ్రీ కుందుర్తి మహికిరణ్ శర్మగారు, హైదరాబాదు. వేదిక : శ్రీ సరస్వతి శిశుమందిరం, రామమందిరం వీధి, చీరాల. నిర్వహించువారు చీరాల గో సేవా సమితి
View More
Local Updates
26 Feb 2025 15:51 PM
0
27
Newsread Image

No.1 Short News

Newsread
గంధం గురునాధం మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన లలిత్ సాగర్
కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాధం అకాల మరణం చెందిన విషయం తెలియగానే దర్శి యువనాయకులు కడియాల లలిత్ సాగర్ మండల నాయకులు కార్యకర్త లు పాల్గొని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.
View More
Local Updates
24 Feb 2025 13:44 PM
1
27

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
దర్శి: బూచేపల్లి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి, శ్రీమతి బూచేపల్లి నందిని రెడ్డి కి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
View More
Local Updates
24 Feb 2025 11:33 AM
3
30
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
రామభద్రపురం లో షాహుల్ పెళ్లి కుమారుని వేడుక లో పాల్గొన్న బూచేపల్లి
తాళ్లూరు మండలం రామబద్రాపురం గ్రామములో షేక్ షాహుల్ పెళ్లి కుమారుని వేడుకలకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.
View More
Local Updates
22 Feb 2025 21:29 PM
0
30
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
శ్రీ గీతాంజలి స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
తాళ్లూరు మండలం, తూర్పు గంగవరం లోని శ్రీ గీతాంజలి హైస్కూల్ - 18వ వార్షికోత్సవ వేడుకల్లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా డా గొట్టిపాటి లక్ష్మీ ని హైస్కూల్ చైర్మన్ యాతం శ్రీనివాస రెడ్డి ఘనంగా సత్కరించారు.
View More
Local Updates
22 Feb 2025 21:16 PM
1
27
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్
ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లుల నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ బిల్లుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు నిరాశను మిగిల్చిన రేవంత్ సర్కార్ ఉద్యోగుల బిల్లుల కోసం నెలకు దాదాపు రూ.1000 కోట్లు అవసరం ఉండగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించాలని, మిగతావి సంక్షేమ పథకాలకు వాడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు దీంతో ఇప్పట్లో బిల్లులు రావని తెలిసి తీవ్ర ఆవేదనలో ప్రభుత్వ ఉద్యోగులు
View More
Local Updates
19 Feb 2025 11:39 AM
0
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నేడు తెలంగాణ భవన్ కు బిఅరెస్ అధినేత కేసీఆర్
నేడు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం 2:00 కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం అన్ని జిల్లాల నుండి ఈ సమావేశానికి 400 మంది పార్టీ కీలక నేతలకు ఆహ్వానం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ డిసిఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్ లను ఆహ్వానం ఈ భేటీలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై కేసీఆర్ చర్చ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలపై ఉద్యమం, రైతు ఆత్మహత్యలపై, ఆటో కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలపై పోరాటం పార్టీ క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తల టార్గెట్ గా ప్రభుత్వం పెడుతున్న కేసులపై పోరాటం వివిధ కీలక అంశాలపై భవిష్యత్తు పార్టీ నిర్ణయంపై కేసీఆర్ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు
View More
Local Updates
19 Feb 2025 11:39 AM
0
27
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్
కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ 3 సార్లు వచ్చి వెళ్ళి, రూ.2.82 లక్షలు కాజేసిన గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ లోకి 4 సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘటనలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ 3 సార్లు వచ్చి వెళ్ళిన దుండగుడు నిందితుడు ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్ లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. దుంగడుగు తన ముందు పలుమార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు. అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానం అని విమర్శలు వస్తున్నాయి.
View More
Local Updates
19 Feb 2025 10:28 AM
0
24
Newsread Image

No.1 Short News

Newsread
తూర్పు గంగవరం: నాగూర్ మీరవాలి దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని నాగూర్ మీరావలి దర్గా యొక్క గంధ మహోత్సవం మునుపెన్నడూ లేని విధంగా జనవరి 10వ తారీఖున చాలా ఘనంగా జరిపారు. గంధ మహోత్సవం జరిగి దాదాపు నెల అవుతుండగా ఈరోజు శుక్రవారం కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 500 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. న్యూస్ రీడ్ ప్రతినిధి: ఉమర్ ఫారూఖ్
View More
Local Updates
07 Feb 2025 22:57 PM
2
63
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
గంగవరం లోని మసీదు వీధి లో కోతుల బెడద
వీధులలో కోతుల వీరవిహారం తాళ్లూరు మండలం .తూర్పు గంగవరంలోని మసీదు వీధి నందు కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి .పిల్లలు ఇంటి నుండి బయటకు రావడానికి కూడా భయపడవలసిన పరిస్థితి వచ్చింది .దీని గురించి అధికారులు స్పందించవలసిందిగా వారు కోరుతున్నారు.
View More
Local Updates
07 Feb 2025 20:27 PM
0
55
Newsread Image

No.1 Short News

Newsread
ప్రపంచ కోకో విజేత పోతిరెడ్డి శివారెడ్డికి స్వగ్రామంలో ఘన స్వాగతం
ప్రపంచ కోకో విజేత జట్టులో ఉన్న మన తెలుగు తేజం పోతిరెడ్డి శివారెడ్డి ఈరోజు స్వగ్రామం ఈదర విచ్చేస్తున్న సందర్భంగా ఈదరలోని మిత్రులు బంధువులు గ్రామస్తులు అందరూ ర్యాలీ నిర్వహిస్తూ తప్పెట్లు తాళ మేళాలతో ఊరేగింపు చేస్తూ ఘన స్వాగతం పలికారు.
View More
Local Updates
04 Feb 2025 21:49 PM
1
26
Newsread Image

No.1 Short News

Newsread
నూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ - Dr. కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు
ఈరోజు దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దర్శి టౌన్ లోని 19వార్డ్ లో తిరుమల వెంకటేశ్వర్లు (బిల్లా) సోదరుడు తిరుమల నాగేంద్ర బాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం పాల్గొన్నారు. వారితో పాటు దర్శి నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Feb 2025 17:11 PM
0
32
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు: రేషన్ బియ్యం పట్టివేత
ముండ్లమూరు మండలం తమ్మలూరు లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆటోలో సుమారు 70 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు ముండ్లమూరు ఎస్సై నాగరాజు తెలిపారు. వినుకొండ నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
View More
Local Updates
03 Feb 2025 19:29 PM
4
30
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో ఘనంగా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిధిగా కపురం
ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దర్శి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఒంగోలు గిత్తలతో, మార్కాపురం పలకలతో, బౌద్ధ స్థూపాలతో, గ్రానైట్ తో తీర ప్రాంతం తో, ఎందరో స్వతంత్ర సమరయోధులు నడిచిన నేల ప్రకాశం జిల్లా అని జిల్లా గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు.
View More
Local Updates
03 Feb 2025 18:49 PM
1
16
Newsread Image

No.1 Short News

Newsread
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో టీడీపీ జోరు మరింత పెరిగింది. తాజాగా హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను ఛైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఈ రోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.
View More
Local Updates
03 Feb 2025 11:56 AM
3
36
Newsread Image

No.1 Short News

Newsread
పెళ్లి లో చోలీ కే పీచే పాటకు డాన్స్ చేసిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన మామ
పెళ్లిలో డాన్స్ చేసిన వరుడు.. అది నచ్చక పెళ్లి కాన్సల్ చేసిన మామ ఢిల్లీలో ఒక పెళ్లిలో ఆసక్తికర ఘటన జరిగింది ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చోలీకే పీఛే క్యాహై పాటకు డాన్స్ చేశాడు ఇది కాబోయే మామకు నచ్చలేదు. అలాంటి వాడికి బిడ్డను ఇచ్చేది లేదంటూ పెళ్లిని కాన్సల్ చేశాడు వరుడు వివరిస్తున్నా వినకుండా ఆడపెళ్ళివారు మండపం నుంచి వెళ్లిపోయారు
View More
Local Updates
03 Feb 2025 10:55 AM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
నిఫ్టీ 250 పాయింట్లు, సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టం స్టాక్ మార్కెట్ పై బడ్జెట్ ఎఫెక్ట్
Local Updates
03 Feb 2025 10:51 AM
1
12
Newsread Image

No.1 Short News

T Mahesh
Hi
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. టీడీపీ నుంచి రమేశ్ కుమార్, వైసీపీ నుంచి లక్ష్మీ మహేశ్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి చేరిన వారు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీకి 23 మంది సభ్యులు ఉండటంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పట్టణంలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే బాలయ్య ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు.
View More
Local Updates
03 Feb 2025 10:38 AM
1
11
Newsread Image

No.1 Short News

Newsread
ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
నేడు దర్శి మండలం, లంకోజనపల్లి గ్రామం లో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ . వారితో పాటు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , అధికారులు మరియు వివిద హోదాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకులు ఉన్నారు.
View More
Local Updates
01 Feb 2025 16:55 PM
3
46
Newsread Image

No.1 Short News

Newsread
ఉత్తమ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అవార్డు గ్రహీత రవికుమార్ ను సత్కరించిన కపురం.
ప్రకాశం జిల్లా ఉత్తమ మోటారు వెహికిల్ Inspector గా, కలెక్టర్ మరియూ ఎస్పీ చేతులమీదుగా అవార్డు గ్రహీత అయిన దరిశి మోటార్ వెహికిల్ Inspector రవికుమార్ , దరిశి పురప్రముఖులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్, అందరివాడు కపురం శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లా అధికారుల మన్ననలుపొంది ప్రభుత్వం,ప్రజలందరి మన్ననలు,ఆశీస్సులు పొంది అవార్డును సొంతంచేసికొన్న MVI రవికుమార్ ని శాలువాతో మరియూ ఫ్లవర్ బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది.
View More
Local Updates
01 Feb 2025 16:46 PM
2
39
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel