

No.1 Short News
Newsreadరాష్ట్రమంతా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేసిన లోకేష్
ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకానన్‌తో మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటి పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలను పెంచేందుకు విశాఖపట్నంలో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనరంగం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసారు
Breaking News
21 Jan 2025 22:12 PM