

No.1 Short News
Newsreadజాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన డా||గొట్టిపాటి లక్ష్మి
వైద్యో నారాయణో హరి అంటారు. దేవుడు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ ఇస్తారు. అందుకే డాక్టర్లను దేవునితో సమానంగా ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతారు. వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు. జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని వైద్యులకు నా శుభాకాంక్షలు. జూలై 1 ప్రఖ్యాత వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డా.బిడన్ చంద్ర రాయ్ గారి పుట్టిన మరియు మరణించిన రోజు. వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు. ప్రతి ప్రాణం కోసం పోరాడే యోధులు వారు. వైద్యుడు తన చేతిలో కత్తిని పట్టుకొని ఉన్నప్పుడు, అది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, ఒక జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. డాక్టర్ల కృషి, త్యాగం సమాజానికి వెలకట్టలేనిది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించటంలో వైద్యులు చేస్తున్న కృషి మరువలేనిది. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనారోగ్య సమస్యలతో, వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదు. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం పూర్తిస్థాయి వైద్య సేవలు అందాలన్నదే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.
Latest News
01 Jul 2025 13:21 PM