No.1 Short News

Newsread
మైండ్‌ బ్లోయింగ్.. డాక్టర్ల కంటే 4 రెట్లు బెటర్.. మైక్రోసాఫ్ట్ కొత్త మెడికల్ AI.. ఇక మానవ డాక్టర్ల అవసరం లేదా?
ఒకవైపు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వార్తల్లో నిలిచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, మరోవైపు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక సంచలన ఆవిష్కరణ చేసింది. మానవ వైద్యుల కంటే నాలుగు రెట్లు కచ్చితత్వంతో రోగ నిర్ధారణ చేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది వైద్య రంగంలో “సూపర్ ఇంటెలిజెన్స్”కు తొలి అడుగు అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. అసలు ఈ AI అంత గొప్పదా? ఇది నిజంగానే అనుభవజ్ఞులైన డాక్టర్లను మించిపోయిందా? ప్రముఖ AI నిపుణుడు ముస్తఫా సులేమాన్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ AI యూనిట్ ఈ అద్భుతమైన టూల్‌ను రూపొందించింది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. MAI-DxO ఒంటరిగా పనిచేయదు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ నిపుణులైన వైద్యుల బృందంలా పనిచేస్తుంది. వివిధ AI ఏజెంట్లు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ (“చైన్-ఆఫ్-డిబేట్” పద్ధతిలో), ఒక క్లిష్టమైన కేసును విశ్లేషించి, ఒక నిర్ధారణకు వస్తాయి. ఇది గుడ్డిగా సమాధానం చెప్పదు. ఒక రోగి వచ్చినప్పుడు డాక్టర్ ఎలా ప్రశ్నలు అడుగుతారో, ఏయే పరీక్షలు (బ్లడ్ టెస్ట్, ఎక్స్-రే) సూచిస్తారో, ఆ ప్రక్రియను స్టెప్-బై-స్టెప్ అనుకరిస్తుంది. “మెడికల్ సూపర్‌ఇంటెలిజెన్స్” భవిష్యత్తు ఇదేనా? మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వైద్య రంగంలో ఒక విప్లవానికి నాంది. “వివిధ AI ఏజెంట్లు కలిసి చర్చించుకునే ఈ పద్ధతి, మనల్ని ‘మెడికల్ సూపర్‌ఇంటెలిజెన్స్’ వైపు వేగంగా తీసుకెళ్తుంది” అని చెప్పారు. ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒకేసారి అనేక వైద్య విభాగాల (కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ) పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. అరుదైన వ్యాధులను సైతం వేగంగా గుర్తించి, వైద్యులకు సాయం చేస్తుంది. రోగులు తమ ఆరోగ్యం గురించి మరింత తెలుసుకోవడానికి, వారి కేసులను మేనేజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. తొందరపడకండి.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. ఈ ఫలితాలు ఎంత అద్భుతంగా ఉన్నా, మైక్రోసాఫ్ట్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. “ఈ టూల్ ఇంకా క్లినికల్ వాడకాల కోసం రెడీగా లేదు” అని చెప్పింది. ఇది ప్రస్తుతం క్లిష్టమైన, అరుదైన కేసులపై మాత్రమే పరీక్షిస్తున్నాం. జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలపై దీని పనితీరును ఇంకా పరీక్షించాల్సి ఉంది. కాబట్టి, ఇది ఇప్పుడప్పుడే మీ స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ స్థానాన్ని భర్తీ చేయదు. మైక్రోసాఫ్ట్ MAI-DxO అనేది మానవ వైద్యులను భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదు. వైద్యులకు బాగా ఉపయోగపడేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది వైద్యులపై పనిభారాన్ని తగ్గిస్తుంది. ఈ టెక్నాలజీ మానవ మేధస్సు , కృత్రిమ మేధస్సు కలిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ.
Latest News
03 Jul 2025 19:40 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.