

No.1 Short News
Newsreadఏపీ సచివాలయాల్లో బదిలీలపై విచారణ, రీకౌన్సిలింగ్.. ? కొత్త డిమాండ్లు..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే జరుగుతున్న బదిలీలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సచివాలయాల ఉద్యోగులు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్దంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ఇప్పటికే ఆరోపిస్తున్న ఉద్యోగులు.. ఇవాళ మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
బదిలీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, రీ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇవాళ విజయవాడలోని గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలోనే అనేకచోట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జీవో 5ని పాటించకుండా అపారదర్శకంగా జరిగిందని ఆరోపించింది. కొన్నిచోట్ల అత్యంత పారదర్శకంగా జరిగిందని, మరికొన్ని చోట్ల ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీనియార్టీలో ఉన్న ఉద్యోగులకు అన్యాయం చేశారని తెలిపింది.
అనేక జిల్లాలలో బదిలీలు జరిగే కౌన్సిలింగ్ కేంద్రాలలో సచివాలయ ఉద్యోగుల సీనియార్టీ జాబితా ప్రదర్శించకుండానే, కేవలం ఆప్షన్స్ మాత్రమే ఫామ్ ద్వారా స్వీకరించి, ఉద్యోగులను వెళ్ళమనడంతో ఉద్యోగులకు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం కాలేదని తెలిపింది. అలాగే జీవో 5లో పేర్కొన్న విధంగా ప్రాధాన్యత కలిగిన ఉద్యోగులకు, కొన్ని కౌన్సిలింగ్ కేంద్రాల్లో ప్రాధాన్యత కల్పించి బదిలీలు చేపట్టలేదని తెలిపింది.
Latest News
03 Jul 2025 20:39 PM