No.1 Short News

Newsread
పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారాన్ని అందించాలి
దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్డులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను దళిత,ప్రజా సంఘాలనాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ చర్మ, డప్పు కళాకారుల పోరాటసంఘం రాష్ట్రవ్యవస్థాపకఅధ్యక్షులు కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులపాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని విద్యార్థులకుతగిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని, అన్నారు. త్రాగునీటి సౌకర్యం విద్యార్థులకు కల్పించాలని, పరిసరాలు పరిశుభ్రంగాఉంచాలని, వంట రూము అపరిశుభ్రత లేకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలని, వారు తెలిపారు. విద్యార్థులకుఅందించే మెనూ అద్దంకిఏజెన్సీనుండి కూరగాయలు, కోడిగుడ్లు, సరఫరా విషయంలో, తగిన జాగ్రత్తలుతీసుకొని, దర్శి నుండి ఏజెన్సీఏర్పాటు చేయాలని, ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు, అనంతరం అక్కడ వండిన వంటలను రుచిచూసి సంతృప్తి చెందారు. విద్యార్థులకు ఆహార పదార్థాలను వేస్ట్ చేయకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు జి.వి రత్నం రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ గర్నిపూడి యాకోబు తదితరులు పాల్గొన్నారు.
Local Updates
09 Jul 2025 20:29 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.