

No.1 Short News
Newsreadడీజే లకు అనుమతి తప్పనిసరి: దర్శి సీఐ వై రామారావు
దర్శి ముండ్లమూరు తాళ్లూరు మండలాల పరిధిలో ఫంక్షన్లకు తిరునాళ్లకు ఏదైనా ఇతర కార్యక్రమాలకు ఎవరైనా మైకు సిస్టం వాడే సమయంలో డీజే లకు అనుమతి లేదని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు చెప్పడం జరిగింది. డీజే లను అధిక సంఖ్యలో వాడటం వల్ల ఆ శబ్దాలకు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు సమస్యలు ఉన్నవారు కూడా చనిపోవడం జరుగుతోంది. కావున ఎవరైనా ఎలాంటి ఫంక్షన్లు, ఉత్సవాలు తిరునాళ్లు అలాగే మీటింగులు జరుపుకోవాలని ఉంటారో వారు ఖచ్చితంగా స్థానిక ఎస్సై ద్వారా సబ్ డివిజనల్ పోలీస్ అధికారికి పర్మిషన్ అప్లై చేసుకోవాలి.
పర్మిషన్ పొందిన వారు మైకు లేదా ఏదైనా సౌండ్ బాక్స్ లు పరిమిత సంఖ్యలో మాత్రమే వాడుతూ సౌండ్ మించకుండా ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన ట్లయితే అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు తెలియజేశారు.
Latest News
07 Oct 2025 19:15 PM