

No.1 Short News
Newsreadసామాన్యుడి నుండి అసామాన్య శక్తి గా చంద్రబాబు 15 ఏళ్ల జైత్రయాత్ర
సామాన్యునిగా రాజకీయాల్లోకి వచ్చి సంక్షోభాలను ఎదుర్కొని ముందుచూపు అభివృద్ధి సంక్షేమాలను చిరునామాగా మార్చుకొని ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళ జైత్ర యాత్ర చేసిన స్పూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు కి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి ఆమె konni😄 విషయాలు చెప్పుకొచ్చారు.
అవి ఏంటంటే...
చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించిహైదరాబాదును సైబరాబాద్‌గా మార్చి, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేశారు. HITEC City, Cyber Towers, Genome Valley, Outer Ring Road వంటి ప్రాజెక్టులు ఆయన విజన్ ఫలితం. Microsoft, Infosys, Wipro, Google వంటి దిగ్గజ కంపెనీలను ఆహ్వానించి యువతకు వేలాది ఉద్యోగాల అవకాశాలు కల్పించారు.
జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజా భాగస్వామ్య అభివృద్ధి ప్రారంభించారు. ఇంకుడు గుంటలు ,వర్షాజల సేకరణ, మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశపెట్టి నీటి యాజమాన్యంలో కొత్త దారులు చూపారు. రైతులకు రైతు బజార్‌లు, e-Seva సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతికతతో ముడివేశారు.
పరిపాలనలో పారదర్శకత సాంకేతికతకు నాంది పలికారు. e-Governance, రియల్ టైమ్ గవర్నెన్స్, CM డాష్‌బోర్డ్ వంటి వ్యవస్థల ద్వారా ప్రతి శాఖపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. అధికారుల పనితీరుకు బాధ్యతను నిర్ధారించే విధానాలు అమలు చేశారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో విశేష ప్రగతి సాధించారు. హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రణాళిక ఆయన కాలంలోనే ప్రారంభమైంది. అమరావతి రాజధాని నగర రూపకల్పనకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు ప్రతి జిల్లాలో విస్తరించారు.
విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, APSSDC ద్వారా యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ అందించారు. ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లెర్నింగ్ పద్ధతులు ప్రవేశపెట్టారు.
పెట్టుబడులు ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ను ముందు వరుసలో నిలిపారు. CII Partnership Summits ద్వారా దేశ, విదేశ పెట్టుబడులను తీసుకొచ్చారు. Kia Motors, Amaravati Start-up Zone, Google Fiber Project వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Vision 2020 ద్వారా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమ, సాంకేతిక రంగాలలో దీర్ఘకాల ప్రణాళికను రూపొందించారు. ప్రజా సేవలకు ఆకస్మిక తనికీలు, ప్రజల వద్దకు పాలన, మీ సేవ వంటి పారదర్శక వ్యవస్థలను ప్రవేశపెట్టారు. లంచం రహిత పరిపాలనకు మార్గం సుగమం చేశారు.
జాతీయ స్థాయిలో అనేక సార్లు ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ప్రపంచ ఆర్థిక వేదిక Davos కు ఆహ్వానించబడిన తొలి భారతీయ ముఖ్యమంత్రి కావడం ఆయన నాయకత్వ ప్రతిభకు నిదర్శనం.
నారా చంద్రబాబు గారి నాటి స్వప్నం విజన్ 2020 నిజమైంది, నేడు విజన్ 2047 కి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
Latest News
10 Oct 2025 21:56 PM