

No.1 Short News
Sk.Asma Reporter 9948680044Gold Price : డబ్బులు రెడీ చేసుకోండి.. బంగారం ధరలు భారీగా పడబోతున్నాయ్.. కారణం ఇదే…
బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తద్వారా ఆల్ టైం గరిష్ఠ రికార్డులను నమోదు చేస్తున్నాయి. దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ప్రజలకు గోల్డ్ రేట్లు షాకిచ్చాయి. అయితే, ప్రస్తుతం గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తులం బంగారంపై సుమారు రూ.2వేలు తగ్గింది. అయితే, రాబోయే కాలంలో గోల్డ్ రేటు మరింత తగ్గబోతుందని పేస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయెల్ పేర్కొన్నారు.
బంగారం, వెండి ధరలు గతంలో ఎప్పుడూలేని స్థాయికి పెరిగాయి. గత 40 సంవత్సరాలలో డాలర్ ఇండెక్స్ బలహీనపడినప్పుడు మాత్రమే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, ప్రతి ర్యాలీ తరువాత.. భారీ అమ్మకాల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయని ఆయన పేర్కొన్నారు.